పది పాసవని వారుకూడా గ్రాడ్యుయేట్లే.. తిరుపతిలో వాలంటీర్ల నిర్వాకమిది: టిడిపి పోలీస్ కంప్లైంట్

Mar 9, 2023, 2:22 PM IST

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార వైసిపి అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి ఆరోపిస్తోంది. ఇలా తిరుపతిలో కొందరు అధికారులు, వాలంటీర్ల నిర్వాకంతో ఏకంగా 7వేల దొంగ ఓట్లు నమోదయినట్లు గుర్తించామని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆధారాలతో సహా రాతపూర్వక ఫిర్యాదు చేసారు. ఒకే ఇంటి చిరునామాతో పదుల సంఖ్యలో దొంగఓట్లు నమోదు చేసినట్లు... సర్టిఫికేట్లు ఫోర్జరీ చేసి వేలాది ఫేక్ గ్రాడ్యుయేట్ ఓట్లు సృష్టించారని రామానాయుడు ఆరోపించారు.229 బూత్ లో ఒకే ఇంటి చిరునామాతో 22 దొంగ ఓట్లను  వాలంటీర్ నమోదు చేయించాడని... మరోచోటు ఒకే డోర్ నంబర్ తో 40 ఓట్లు నమోదయి వున్నాయన్నారు.ఓ ఎలక్ట్రికల్ ఏఈ సంతకంతో ఏకంగా 270 దొంగఓట్లు సృష్టించారంటే పరిస్థితిని ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని రామానాయుడు ఆందోళన వ్యక్తం చేసారు.