ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా అధికారులను ఉద్దేశించి “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజలకు అందాల్సిన ఆహార భద్రత, రేషన్ పంపిణీ వ్యవస్థపై ఆయన సమీక్ష నిర్వహించారు.