Ap Deputy CM Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం | Asianet News Telugu

Published : Jan 29, 2026, 11:18 PM IST

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా స్థానిక జంతు ప్రదర్శనశాలను సందర్శించిన ఆయన, తల్లి అంజనాదేవి జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ జూలో ఉన్న జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఏడాది కాలం పాటు ఆ జిరాఫీల పోషణ ఖర్చులను పవన్ కళ్యాణ్ స్వయంగా భరిస్తారని తెలిపారు.