May 17, 2020, 11:16 AM IST
కర్నూల్ జిల్లా ఆదోనిలో మహిళను 3 టౌన్ ఎస్.ఐ. రాజ కుళ్లాయప్ప దుర్భాషలాడారు. బైక్ పై డబుల్ వెళ్తున్నారని పోలీసులు ఓ మహిళను ఆపారు. ఆసుపత్రికి వెళ్లి వస్తున్నామని మహిళ పోలీసులకు తెలిపింది. మహిళ ఆవేదనతో చెబుతున్నా పోలీసులు ఏ మాత్రం కనికరం చూపలేదు. మహిళ అని చూడకుండా అసభ్య పదజాలంతో న త్రీ టౌన్ ఎస్.ఐ. రాజ కుళ్లాయప్ప దుర్భాషలాడారు. ఎస్.ఐ. తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.