అరెళ్ళ చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితున్ని అదివారం పోలీసులు అరెస్టు చేశారు.
చిత్తూరు జిల్లా అంగల్లులో చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అనుమనుహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే అత్యాచారం చేసి హత్య చేసాడా లేదా మరి ఎవరితోనైనా కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పాడి ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
కాకినాడలో దారుణం:రెండు రూపాయాల కోసం సువర్ణ రాజు హత్య
undefined
రెండు రోజుల క్రితం అంగల్లులో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బి.కొత్తకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు తమ ముగ్గురు కుమార్తెలతో కలసి బంధువుల వివాహానికి అంగళ్లులకు వెళ్లారు. ఇద్దరు పిల్లలు తల్లితో కలిసి ఉండగా మూడో కుమార్తె(6) ఆడుకుంటూ బయటకు వచ్చింది.
చిన్నారి వర్షిత హత్య: లైంగిక దాడి, హంతకుడు కర్ణాటకవాసి?
ఆ సమయంలో ఓ అగంతకుడు ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు, రాత్రి పదిగంటల సమయంలో బాలిక కనిపించకపోవడంతో అంతా వెతికారు.
చిన్నారి కనిపించకపోవడంతో ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు శుక్రవారం ఆ బాలిక కల్యాణ మండపం సమీపంలోనే శవమై కనిపించింది.
చిన్నారి మృతదేహన్ని పరిశిలించిన పోలీసులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.
బాలిక మృతితో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి, బాధితులను వెంటనే అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
.