చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదం... టిడిపి నాయకుడి ఇంట విషాదం

By Arun Kumar PFirst Published Nov 9, 2019, 9:37 PM IST
Highlights

గంగవరం మండలం గండ్రాజుపల్లి పంచాయతీ మర్రిమాకులపల్లె గ్రామంలో విషాదంఛాయలు అలుముకున్నాయి.  ఒకే కుటుంబానికి చెందినవారు నిన్న రాత్రి కంటైనర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువుకు బలయ్యారు. 

చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై నిన్న(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద ఓ కంటైనర్ అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లడంతో 12 మంది మృతిచెందారు. ఈ ప్రమాద మృతుల్లో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడంలో ఆ  ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. 

తెలుగుదేశం పార్టీ గంగవరం బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ కుటుంబ సభ్యులు తొమ్మిది మంది సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మృతుల స్వగ్రామానికి  చేరుకున్న పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్.వెంకటయ్య గౌడ్, ఎంపీ రెడ్డెప్ప వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపారు. 

 ఒకే ఊరిలో ఇంత మంది మృత్యువాతపడటం చాలా బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తక్షణ సహాయం కింద దహన సంస్కారాలకు గాను ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చెక్కులకు కుటుంబ సభ్యులకు అందించారు.

read more  video news : చిన్నారి వర్షిణికి న్యాయం చేస్తాం...దోషులను కఠినంగా శిక్షిస్తాం..

గంగవరం మండలం గండ్రాజుపల్లి పంచాయతీ మర్రిమాకులపల్లె గ్రామంలో విషాదంఛాయలు అలుముకున్నాయి.  ఒకే కుటుంబానికి చెందినవారు నిన్న రాత్రి కంటైనర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువుకు బలయ్యారు. ఈ దిగ్బ్రాంతి కరమైన సంఘటనతో మర్రిమాకుల పల్లిలో రోదనలు మిన్నంటాయి.

కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అది ఆటో, మినీ వ్యాన్, బైక్‌పై దూసుకెళ్లింది. దీంతో కంటైనర్ కింద నలిగిపోయి వీరు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే.. వీరందరూ గంగవరం మండలం మరిమాకుల పల్లె గ్రామానికి చెందిన వారు.  

read more చిత్తూరు: వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్, 12 మంది దుర్మరణం
 ఈ ఘటనలో ఆటో, టూ వీలర్, వ్యాన్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని గ్రామాల ప్రజలు క్షతగాత్రులను కాపాడటంలో పోలీసులకు సహకరించారు. 

 

click me!