కర్నూల్ కష్టమే...ఆ కోటాలో రాజధానిగా తిరుపతి: మాజీ ఎంపీ

By Arun Kumar P  |  First Published Dec 23, 2019, 5:03 PM IST

వైసిపి ప్రభుత్వం ప్రకటించినట్లు మూడు రాజధానుల ఏర్పాటు చాలా కష్టంతో కూడుకున్నదని...  ముఖ్యంగా కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు సాధ్యపడదని మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. 


తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా రాజధాని కేవలం అమరాతికే పరిమితం కాదని...వెనుకబడిన ప్రాంతాలయిన ఉత్తరాంధ్ర, రాయలసీమలలో కూడా రాజధానిని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇలా అమరావతి, విశాఖ పట్నం, కర్నూల్  లలో మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ  నేపథ్యంలో ఇతర ప్రాంతాల నాయకులు రాజధానిని డిమాండ్ చేయడం ప్రారంభించారు. 

ఇలా కర్నూల్ లో కాకుండా రాజధానిని తిరుపతిలో ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ సీఎం జగన్ ను కోరారు. 1953 సంవత్సరంలో తిరుపతిని రాజధాని చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్లు గుర్తుచేశారు. దీన్ని దృష్టిలో వుంచుకుని తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Latest Videos

undefined

శ్రీకాకుళం- ఆముదాలవలస మధ్యలో మరో రాజధాని...: కూన రవి

ఉమ్మడి  రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నేటి ఆంధ్ర ప్రదేశ్ వరకు మొత్తంగా నాలుగుసార్లు రాజధానుల మార్పు జరిగినట్లు... ఐదోసారి కూడా మారడం ఖాయమన్నారు. అలాగే ప్రస్తుతం ప్రకటించినట్లుగా జరగడం కష్టమని... ముఖ్యంగా కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశం లేదని చింతా మోహన్‌ పేర్కొన్నారు.

నూతన సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ దొందు దొందేనని విమర్శించారు. వీరిద్దరు ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని డిల్లీలో తాకట్టు పెడుతున్నారని అన్నారు. అమితా  ఇంటి చుట్టూ తిరిగేది వీరు కాదని ఆంధ్రుల ఆత్మగౌరవమని అన్నారు.  

read more  101ఏళ్ళ జీవితంలో జగన్ లాంటి సీఎంను చూడలేదు: యడ్లపాటి వెంకట్రావు

ఆద్యాత్మికంగానే  కాదు అబివృద్ది పరంగా తిరుపతి చాలా ముందుందని అన్నారు. దీన్ని రాజధానిగా చేస్తే  పరిపాలనకు అన్నిరకాలుగా  అనుకూలంగా వుండటమే  కాదు అభివృద్ది కూడా వేగంగా సాధ్యమవుతుందని  చింతా మోహన్ వెల్లడించారు. 

 

click me!