చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసాన్ని తట్టుకోలేక ఫాతిమా అనే డిగ్రీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసాన్ని తట్టుకోలేక ఫాతిమా అనే డిగ్రీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే మదనపల్లిలోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న ఫాతిమా అనే విద్యార్ధిని ఇబ్రహీం అనే వ్యక్తిని ప్రేమించింది.
ఇద్దరూ సన్నిహితంగా మెలగడంతో ఫాతిమా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే ఇబ్రహీం ఆమెను రేపు మాపు అంటూ దూరం పెట్టసాగాడు. ఈ క్రమంలో అతనికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నట్లు తెలుసుకున్న ఫాతిమా తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోవడానికి ముందు ఇబ్రహీం తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తల్లిదండ్రులకు వాట్సాప్‌లో మేసేజ్ చేసిన ఫాతిమా.. అతనితో కలిసి దిగిన ఫోటోను సైతం పంపించింది.
ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న తమ బిడ్డను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మృతదేహాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తల్లిదండ్రులు అతనిని కఠినంగా శిక్షిస్తేనే తమ కూతురికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు. కాగా అతను గతంలోనే మరో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసిగించినట్లుగా తెలుస్తోంది.