ఇక వాట్సాప్​ మెసేజేస్ వాటంతట అవే మాయం.. ఎలాగంటే!

By Rekulapally SaichandFirst Published Dec 29, 2019, 12:49 PM IST
Highlights


నిర్ణీత సమయం తరువాత మనం పంపిన, మనకు వచ్చిన సందేశాలు వాటంతట అవే అదృశ్యం అయ్యే సరికొత్త ఫీచర్​ను వాట్సాప్.. తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్లలో తీసుకొచ్చింది.

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్ణీత సమయం తరువాత మనం పంపిన, మనకు వచ్చిన సందేశాలు వాటికవే అదృశ్యం కావడం దీని స్పెషాలిటీ. 

ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​ వినియోగదారులకు మాత్రమే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐఓఎస్​లో​ బీటా వెర్షన్​ 2.20.10.23 అప్​డేట్​లో ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 'డిలీట్ మెసేజ్​' సౌలభ్యం గ్రూప్ చాట్​లకే పరిమితం కానున్నది. వీటిలోనూ వాట్సాప్​ గ్రూప్ అడ్మిన్​లు మాత్రమే ఈ సందేశాలు పంపించగలరు. 

అయితే త్వరలో వ్యక్తిగత చాట్​లకూ ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.'సందేశాలను తొలగించు'ఇంతకు ముందు 'అదృశ్యమయ్యే సందేశాలు'గా పేర్కొన్న వీటిని ఇప్పుడు 'డిలీట్ మెసేజ్' అంటున్నారు. డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ప్రకారం, వాట్సాప్​ 'సందేశం' ఎంత సమయం కనిపిస్తోందో వినియోగదారులు ముందే చూడగలరు.

2020 చివరికల్లా 5జీ స్పెక్ట్రం.. వేలం...

ఉదాహరణకు మీ గ్రూపులో ఒకరి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలపాలనుకుందాం. అందరూ సందేశాలు పంపిస్తారు. తరువాతి రోజు వాటి అవసరం ఉండదు. కనుక నిర్ణీత సమయం తరువాత అదృశ్యం అయ్యేలా మన సందేశాలు పంపించవచ్చు.

డార్క్​ మోడ్​, ఫింగర్ ప్రింట్ లాక్​ సహా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్​ కృషి చేస్తోంది. వినియోగదారుల గోప్యతను పరిరక్షించడానికి వాట్సాప్... ఫింగర్​ ప్రింట్ లాక్​ ఫీచర్​ను తీసుకురాబోతోంది. ఇప్పటికే టెలిగ్రామ్​, హైక్ వంటి పోటీ యాప్​లు ఈ దిశగా అడుగులు వేయడం గమనార్హం.

మార్కెట్ లోకి కొత్త బ్లూటూత్ స్పీకర్...10 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్

click me!