Glowing Skin: కాఫీ పొడిలో వీటిని కలిపి రాస్తే.. ముఖం మెరిసిపోవడం పక్కా!

Published : Jun 22, 2025, 05:11 PM IST
Glowing Skin: కాఫీ పొడిలో వీటిని కలిపి రాస్తే.. ముఖం మెరిసిపోవడం పక్కా!

సారాంశం

సాధారణంగా ఎండలో తిరిగినప్పుడు ముఖం నల్లగా మారుతుంది. చర్మం కమిలిపోతుంది. అయితే ఈ సమస్యను తగ్గించేందుకు కాఫీ పొడి సూపర్ గా పనిచేస్తుందట. మరి కాఫీ పొడిలో ఏం కలిపి రాస్తే.. మంచి ఫలితాలు వస్తాయో ఇక్కడ చూద్దాం.  

సాధారణంగా వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఎండలో తిరగడం వల్ల ముఖం నల్లబడుతుంది. చర్మం కమిలిపోతుంది. దానివల్ల అందం తగ్గిపోతుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు చాలామంది మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రోడక్టులను వాడుతుంటారు. అయితే వీటిలో చర్మానికి మేలు చేసేవాటి కన్నా హాని చేసేవే ఎక్కువ. కొన్ని ప్రోడక్టుల్లో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అవి చర్మ సమస్యలను మరింత పెంచుతాయి.   

కాబట్టి చర్మ ఆరోగ్యానికి సహజ పదార్థాలను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. మన ఇంట్లో.. ముఖ్యంగా వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.

సాధారణంగా చర్మం రంగులో మార్పు వచ్చింది అంటే.. చర్మంలో మృత కణాలు, మురికి ఎక్కువగా పేరుకుపోయాయని అర్థం. ఇలాంటి పరిస్థితిలో చర్మాన్ని లోతుగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకోసం మురికి, చనిపోయిన కణాలను తొలగించాలి. 

దీనికోసం మన వంటింట్లో ఉండే కాఫీ పొడితో స్క్రబ్ తయారుచేసుకోవాలి. దాన్ని వాడితే చర్మాన్నిఈజీగా మెరిసేలా చేయవచ్చు. చర్మం రంగును కూడా పెంచుకోవచ్చు. మరి కాఫీ పొడితో స్క్రబ్ ఎలా తయారుచేయాలి? ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.

స్క్రబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  1. కాఫీ పొడి ఫేస్ మాస్క్..

కాఫీ పొడి - 1 స్పూన్

పంచదార - 1 స్పూన్

తేనె - 1 స్పూన్

కొబ్బరి నూనె - 1 స్పూన్

వేడి చేయని పాలు లేదా రోజ్ వాటర్ - 1 స్పూన్

స్క్రబ్ తయరీ విధానం:

ఈ స్క్రబ్ తయారీకి ఒక గిన్నెలో కాఫీ పొడి, పంచదార, కొబ్బరి నూనె తీసుకోండి. తర్వాత అందులో వేడి చేయని పాలు లేదా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోండి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.

ఇప్పుడు తయారుచేసిన ఈ పేస్ట్ ని మీ ముఖం, మెడపై రాసి మెల్లగా మసాజ్ చేయండి. అలా 4-5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖం, మెడ కడుక్కుని.. శుభ్రమైన టవల్ తో తుడుచుకోవాలి. చివరగా మాయిశ్చరైజర్ లేదా సీరం రాసుకోవాలి.

ఈ స్క్రబ్ ని వారానికి 2 సార్లు వాడాలి. అది కూడా రాత్రి పడుకునే ముందు వాడాలి. దీన్ని క్రమం తప్పకుండా వాడితే చర్మంలోని మృత కణాలు తొలగిపోయి ముఖం మెరుస్తుంది. చర్మం రంగులో మంచి మార్పు కనిపిస్తుంది.

2.  కాఫీ పొడి, తేనె ఫేస్ మాస్క్: 

కావాల్సిన పదార్థాలు

కాఫీ పొడి – 1 టీస్పూన్

చక్కెర – 1 టీస్పూన్

తేనె లేదా కొబ్బరినూనె – 1 టేబుల్ స్పూన్

పై పదార్థాలన్నీ కలిపి ముఖంపై సున్నితంగా 2 నుంచి 3 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా వారానికి 1–2 సార్లు చేయవచ్చు.

3. కాఫీ & యోగర్ట్ మాస్క్: 

కావాల్సిన పదార్థాలు: 

కాఫీ పొడి – 1 టీస్పూన్

పెరుగు (curd/yogurt) – 1 టేబుల్ స్పూన్

ఈ రెండు పదార్థాలను బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలపాటు అలాగే ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడగండి. ఇది చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది. కాంతివంతంగా మారుస్తుంది.

3. కాఫీ & ఆలివ్ ఆయిల్ మాస్క్

కావాల్సిన పదార్థాలు: 

కాఫీ పొడి – 1 టీస్పూన్

ఆలివ్ ఆయిల్ – 1 టీస్పూన్

ఈ రెండు పదార్థాలను కలిపి ముఖంపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. ఇది పొడి చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ మాస్కును వారానికి 2 సార్లకు మించి ఉపయోగించకూడదు. దానివల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఇవి గుర్తుంచుకోండి

  • ఈ ఫేస్ మాస్కులను ట్రై చేసే ముందు చర్మంపై కొద్దిగా రాసి పరీక్షించిన తర్వాత ముఖానికి ఉపయోగించడం మంచిది. 
  • కాఫీ పొడి చాలా మెత్తగా ఉండేలా చూసుకోండి. 
  • స్కిన్ అలర్జీ ఉన్నవారు నిపుణుల సలహాతో ఈ ఫేస్ మాస్కులను ఉపయోగించడం మంచిది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్
నాన్ స్టిక్ పాత్రను ఎంతకాలం వాడొచ్చు? వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?