జోగిని శ్యామల మీద జీరో ఎఫ్ఐఆర్.. !!

Published : Mar 16, 2021, 12:37 PM IST
జోగిని శ్యామల మీద జీరో ఎఫ్ఐఆర్.. !!

సారాంశం

జోగిని శ్యామల మీద జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు అయ్యింది. మెదక్ లోని ఏడుపాయల జాతరలో తనమీద దాడి చేసి అభ్యంతరకరంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని స్రవంతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నెల 12న తల్లితో కలిసి ఏడు పాయల జాతరకు వచ్చిన స్రవంతి పట్ల జోగిని శ్యామల అసభ్యంగా ప్రవర్తించింది. 

ఈ నేపథ్యంలో బాధిత మహిళ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ కేసును పంజాగుట్ట పీఎస్ నుండి మెదక్ జిల్లా పాపన్న పేట పీఎస్ కు బదిలీ చేశారు. అయితే దీనిమీద జోగిని శ్యామల స్పందించింది. 

కేసు పెట్టిన జోనిగి స్రవంతినే తనమీద దాడి చేసిందంటూ శ్యామల పేర్కొంది. తాగొచ్చి జాతరలో గొడవ చేసిందని, వీడియోలో పోలీసులపై స్రవంతి దాడి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. తన ఎదుగుదల చూసి, పరువు తీయడానికి ఇవన్నీ చేస్తున్నారని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !