కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఉరేసుకున్న రైతు..

By AN TeluguFirst Published Mar 16, 2021, 12:04 PM IST
Highlights

కరోనా పాజిటివ్ రావడంతో భయపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ధారూరు మండలం నాగసమందర్ లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగసమందర్ కు చెందిన ముతికె శాంత్ కుమార్ (54) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

గత మూడు రోజులుగా శాంత్ కుమార్ దగ్గు, దమ్ము, జ్వరంతో బాధపడుతున్నాడు. సోమవారం ఉదయం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది. 

దీంతో మనస్తాపానికి గురైన శాంత్ కుమార్ ఇంటికి వచ్చాక దూలానికి ఉరేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు , గ్రామస్తులు అడ్డుకుని, నచ్చజెప్పారు. దీంతో అప్పటికి ప్రయత్నాన్ని విరమించాడు.

ఆ తర్వాత సాయంత్రం వేళ భార్య నాగవేణి(50)ని నీళ్లు తీసుకురమ్మని ఇంట్లో నుంచి బైటికి పంపించి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికొచ్చిన భార్య గుండెలు బాదుకుంటూ ఇతరుల సాయంతో అతన్ని కిందకు దింపి చూడగా అప్పటికే శాంత్‌కుమార్‌ మరణించాడు.

మృతుడి కుమారుడు భీమలింగం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సురేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లారు. డాక్టర్ ను పిలిపించి పోస్ట్ మార్టమ్ చేయించారు. కోవిడ్ నిబంధనల మేరకు అంత్యక్రియలు జరిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. 

మృతుడికి భార్యతో పాటు కొడుకులు శివశంకర్, భీమలింగ్ లు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారమైన శాంత్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

click me!