తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటమే నోములకు స్పూర్తి: మంత్రి జగదీష్ రెడ్డి

Arun Kumar P   | Asianet News
Published : Mar 16, 2021, 12:11 PM ISTUpdated : Mar 16, 2021, 12:12 PM IST
తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటమే నోములకు స్పూర్తి: మంత్రి జగదీష్ రెడ్డి

సారాంశం

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేత నోముల నర్సింహయ్య అని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.   

హైదరాబాద్: జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన నేత నోముల నరసింహ్మయ్య అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేత ఆయన అని ఆయన కొనియాడారు. 

మంగళవారం రోజు రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాగంగా దివంగత నోముల నరసింహ్మయ్య మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణా సాయుధ రైతాంగా పోరాట స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లో నోముల రాణించారన్నారు. భూస్వామ్య పెత్తందారీ వర్గాలకు వ్యతిరేఖంగా ప్రశ్నించిన గొంతుక నోములదని ఆయన అభివర్ణించారు.

దివంగత నేత సీనియర్ మార్కిస్టు నేత నర్రా రాఘవ రెడ్డి అనుచరుడిగా నోముల అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం పంచుకున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలంగాణా రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తాను రాసిన వ్యాసాలపై స్పందిస్తూ సూర్యాపేటలో మొట్టమొదటి సారిగా నోముల నరసింహ్మయ్య కలుసుకున్న సందర్బాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఉటంకించారు. 

సిపియం నేతగా నాడు తాను రాసిన వ్యాసంపై పార్టీ డిఫెన్స్ లో పడిందని చెబుతూనే ఎన్నటికో ఒక నాడు నేను మీ దారిలోకి వస్తానంటూ చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ తీరుగానే రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జరిగిన 2014 ఎన్నికల నాటికి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ లోకి వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. అటువంటి నేత నేడు మనమధ్యలో లేక పోవడం దురదృష్టకరమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. 
 

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం