దారుణం.. ఉద్యోగమిస్తానని నమ్మించి, ఓయో లాడ్జ్ కి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం..

Published : Mar 28, 2022, 10:06 AM IST
దారుణం.. ఉద్యోగమిస్తానని నమ్మించి, ఓయో లాడ్జ్ కి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం..

సారాంశం

ఉద్యోగం, మంచి జీతం పేరుతో వల వేసి ఓ మహిళ మీద అత్యాచారానికి తెగబడ్డాడో ప్రబుద్ధుడు. అతని మోసానికి గానూ జీరోఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేశారు. 

అమీర్ పేట : job ఇస్తానని నమ్మబలికిన ఓ ప్రబుద్ధుడు (23)  నమ్మి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చైతన్యపురి ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ గా నమోదై  ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు  తెలిపిన వివరాల ప్రకారం..  కర్నూలు జిల్లా  కొలిమిగుండ్ల  మండలానికి చెందిన ఓ యువతి (19) నాలుగేళ్లుగా దిల్సుఖ్ నగర్ సమీపంలోని చైతన్యపురి కాలనీలో టెలీకాలర్ గా పనిచేస్తుంది.

ఈనెల 7న తననుతాను సిద్ధార్థ రెడ్డిగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, రూ. 18 వేల వేతనం చెల్లిస్తానని నమ్మబలికాడు. టెలీకాలర్ సంస్థ నుంచి తన ఫోన్ నెంబర్ సేకరించినట్లు చెప్పాడు. 9న కారులో దిల్షుక్నగర్ కు వచ్చి యువతిని తన వెంట తీసుకుని ఎర్రగడ్డకు వచ్చాడు. మార్గమధ్యలో యువతి ఫోటోలు, గుర్తింపు కార్డు పత్రాలు తీసుకున్నాడు. ఎస్ఆర్ నగర్ లోని Oyo లాడ్జ్ కి తీసుకెళ్లి యువతి పేరిట గది బుక్ చేశాడు. 

ఉద్యోగం గురించి ప్రశ్నిస్తే రాత్రి భోజనం చేసిన తరువాత అడ్వాన్స్ చెల్లిస్తానని నమ్మబలికాడు. లాడ్జి గదిలోకి వెళ్ళిన తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు విషయం ఎవరికైనా చెబితే ఫోటోలు మీడియాకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలు అక్కడినుంచి ఎలాగో తప్పించుకొని వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్సార్ నగర్ ఠాణాకు బదిలీ చేశారు.

ఇదిలా ఉండగా, ఓ యువతి ఏకంగా మూడు నెలల్లో ఏడు పెళ్లిళ్లు చేసుకుని.. యువకులను మోసం చేసిన ఘటన హర్యానాలో తాజాగా సంచలనం సృష్టించింది. అనాథలా తనను పరిచయం చేసుకోవడం.. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం.. మొదటి రాత్రి భర్తకు మత్తుమందు ఇవ్వడం… డబ్బు, నగలతో మాయమవడం..  ఇదే స్క్రిప్ట్ ను ఒకటి కాదు రెండు కాదు.. మూడు నెలల వ్యవధిలో ఏడు సార్లు ప్రయోగించింది ఆ యువతి.  ఏడుగురు పెళ్లి కుమారులను మోసగించింది.  చివరకు యువతితో పాటు ఆమె ముఠా సైతం పోలీసులకు చిక్కింది. హర్యానాకు చెందిన ఓ యువతి పెళ్లికాని యువకులను, విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకునేది.  

వారికి వలపు వల విసిరి పెళ్లి వరకు తీసుకు వెళ్ళేది.  వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి మత్తుమందు మాత్రలు ఇచ్చి.. ఇంట్లో ఉన్న డబ్బు నగలతో ఉదయించేది. భర్తకు అనుమానం వచ్చేలోపే ముఠాతో కలిసి ప్రణాళికను అమలుచేసేది. ఈ పథకం అమలు కాకపోతే మరో మార్గం ఎన్నుకునేది.వరకట్నం వేధింపుల పేరుతో భర్తను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేది. తనకు తల్లిదండ్రులు లేరని అందరినీ నమ్మించేది.  ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. ఈ గ్రూపులో మ్యారేజ్ ఏజెంట్,  నలుగురు పురుషులు సహా ముగ్గురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్