చందానగర్ పరువు హత్య: హేమంత్ ను చంపేందుకు రూ. 10 లక్షల సుఫారీ

Published : Sep 25, 2020, 05:10 PM IST
చందానగర్ పరువు హత్య: హేమంత్ ను చంపేందుకు రూ. 10 లక్షల సుఫారీ

సారాంశం

హైద్రాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్ ను హత్య చేసేందుకు అవంతి మేనమామ యుగంధర్ రూ. 10 లక్షలకు కిరాయి హంతకులకు చెల్లించినట్టుగా పోలీసుల దర్యాప్తులో  తేలింది.


హైదరాబాద్: హైద్రాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్ ను హత్య చేసేందుకు అవంతి మేనమామ యుగంధర్ రూ. 10 లక్షలకు కిరాయి హంతకులకు చెల్లించినట్టుగా పోలీసుల దర్యాప్తులో  తేలింది.

హేమంత్ ను ప్రేమించి అవంతి పెళ్లి చేసుకొంది.కులాంతర వివాహం చేసుకొన్నందుకు గాను పరువు హత్య చేయించాడు అవంతి కుటుంబసభ్యులు.

ఈ నెల 24వ తేదీ సాయంత్రం హేమంత్, అవంతిని  మేనమామలు, ఇతర కుటుంంబసభ్యులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు.  అదే రోజు సాయంత్రం హేమంత్ ను సంగారెడ్డికి సమీపంలో హత్య చేశారు.

also read:చందానగర్‌లో పరువు హత్య: 12 మంది అరెస్ట్

ఈ హత్య చేసేందుకు అవంతి మేనమామ యుగంధర్ చందానగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులకు సుఫారీ ఇచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ ఇద్దరికి రూ. 10 లక్షలను  హత్య కోసం యుగంధర్ ఇచ్చాడని పోలీసులు తేల్చారు. ఈ హత్య కేసులో ఇప్పటికీ అవంతి తల్లిదండ్రులతో పాటు 12 మందిని అరెస్ట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?