హేమంత్ హత్య కేసు: నిందితులు వీరే, అంతా అవంతి బంధువులే

By telugu teamFirst Published Sep 25, 2020, 1:30 PM IST
Highlights

చందానగర్ పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతి కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: చందానగర్ పరువు హత్య కేసులో పోలీసులు అవంతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అవంతి భర్త హేమంత్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అవంతి కుటుంబ సభ్యులే ఆమెనూ హేమంత్ ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. 

కిడ్నాప్ చేసింది. హత్య చేసింది కూడా అవంతి కుటుంబ సభ్యులేనని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 11 మంది పేర్లు బయటకు వస్తున్నాయి. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. అవంతి తండ్రితో పాటు ఇతర బంధువులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు..

అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, యుగంధర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వారితో పాటు నలుగురు మహిళలు స్వప్న, స్పందన, రజిత, అర్చనలను కూడా పోలీసులు నిందితులుగా గుర్తించారు.

తెలంగాణలో ప్రణయ్ హత్య సంఘటనలాంటిదే మరో సంఘటన జరిగింది. కూతురి ప్రేమ వివాహం నచ్చని తండ్రి ఆమె భర్త హేమంత్ ను దారుణంగా హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి వద్ద హేమంత్ హత్య జరిగింది. అతన్ని ప్రేమ వివాహం చేసుకున్న యువతి మాత్రమే కారులోంచి తప్పించుకుని పారిపోయింది. 

తన కూతురి ప్రేమ వివాహం నచ్చని ఆమె తండ్రి ఆమె భర్తను కిరాయి గుండాలతో హత్య చేయించాడు. హేమంత్ ను, అతన్ని వివాహం చేసుకున్న యువతిని గురువారం మధ్యాహ్నం కిరాయి గుండాలో హైదరాబాదులోని గచ్చిబౌలిలో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతన్ని హత్య చేశారు. హేమంత్ మృతదేహం గచ్చిబౌలిలో కనిపించింది.

తమను కిరాయి గుండాలు కిడ్నాప్ చేసిన విషయాన్ని ప్రేమజంట 100కు ఫోన్ చేశారు. పోలీసులు గాలింపు జరుగుతుండగానే దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆ జంట కొద్ది కాలం అజ్ఞాతంలోకి వెళ్లింది. తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని యువతి చెప్పడంతో ఆ తర్వాత ఇరు కుటుంబాలు రాజీకి వచ్చారు. 

అంతా సద్దుమణిగిందని భావించిన తరుణంలో హేమంత్ జరిగింది. హేమంత్ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. 

click me!