లాల్ దర్వాజ బోనాలు : మరో మహిళ చేతికి బోనం, అమ్మవారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయిన షర్మిల

Siva Kodati |  
Published : Jul 24, 2022, 09:38 PM IST
లాల్ దర్వాజ బోనాలు : మరో మహిళ చేతికి బోనం, అమ్మవారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయిన షర్మిల

సారాంశం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివాదంలో ఇరుక్కున్నారు. బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చిన ఆమె.. బోనం సమర్పించకుండానే వెనుదిరగడం విమర్శలకు తావిచ్చింది. 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ బోనాల జాతర సందర్భంగా లాల్ దర్వాజా (lal darwaza bonalu) అమ్మవారికి ఆదివారం షర్మిల బోనం సమర్పించేందుకు వచ్చారు. అయితే ఆలయం వరకు వచ్చిన ఆమె లోపలికి వెళ్లకుండా తన నెత్తి మీద వున్న బోనాన్ని మరో మహిళకు ఇచ్చి ఆలయంలోకి పంపించారు. అనంతరం పక్కనే వున్న వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. దీంతో షర్మిల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను తెలంగాణ గడ్డ మీదే పుట్టానని.. ఇక్కడి ఆడపడుచునని చెప్పుకునే షర్మిల, తెలంగాణ సంప్రదాయం విషయానికి వచ్చేసరికి ఇలా ప్రవర్తించడమేంటని పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. 

ఇకపోతే.. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. మాజీమంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు వీరేందర్‌ గౌడ్‌ దంపతులు మొదటి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారికి భోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. 

ALso Read:కేటీఆర్ కాలికి గాయం : త్వరగా కోలుకోవాలంటూనే వైఎస్ షర్మిల సెటైర్లు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (pv sindhu) కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పీవీ సింధు బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అయితే గతకొంతకాలంగా పీవీ సింధు.. అమ్మవారికి భోనం సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది టోర్నమెంట్ కారణంగా.. అమ్మవారికి భోనం సమర్పించలేకపోయారు. 

అమ్మవారికి భోనం సమర్పించిన అనంతరం సింధు మాట్లాడుతూ.. తనకు బోనాల పండగ అంటే ఇష్టమని చెప్పారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. అయితే గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని చెప్పారు. ఈ సారి అమ్మవారిని దర్శించుకుని భోనం సమర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ రోజు లండన్ వెళ్లనున్నట్టుగా చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu