పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, ప్రపంచ ధ్యానగురువు సుభాష్ పత్రీజీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పత్రీజీ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి మహేశ్వర మహాపిరమిడ్‌లో తుదిశ్వాస విడిచారు.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా (pyramid spiritual society movement of india) వ్యవస్థాపకులు, ప్రపంచ ధ్యానగురువు సుభాష్ పత్రీజీ (subhash patriji) కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పత్రీజీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొద్దిరోజుల క్రితం బెంగుళూరు నుంచి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి మహేశ్వర మహాపిరమిడ్‌కు (maheshwara pyramid) తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో పిరమిడ్‌లోని 31వ విల్లాలో చికిత్స తీసుకుంటున్న పత్రీజీ మూడు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతతో, స్పృహ లేకుండా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పత్రీజీ కన్నుమూసినట్లు పిరమిడ్ వర్గాలు ఆదివారం అధికారికంగా ప్రకటన చేశాయి. ఈ విషయం తెలుసుకున్న ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, సాధకులు, ఆధ్యాత్మికవేత్తలు ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో మహేశ్వర మహాపిరమిడ్‌కు తరలివస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు సుభాష్ పత్రీజీ అంత్యక్రియలు నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.