వైఎస్ఆర్‌టీపీ కీలక సమావేశం: కాంగ్రెస్‌లో విలీనంపై ప్రకటనకు ఛాన్స్

By narsimha lodeFirst Published Jan 2, 2024, 9:25 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనానికి సంబంధించి కీలక ప్రక్రియ ఇవాళ జరిగే అవకాశం ఉంది. వైఎస్ఆర్‌టీపీ  సమావేశం ఇవాళ  లోటస్ పాండ్ లో జరగనుంది.


హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ  కీలక సమావేశం  మంగళవారం నాడు  హైద్రాబాద్ లో జరగనుంది.  కాంగ్రెస్ పార్టీలో యువజన శ్రామిక  రైతు తెలంగాణ పార్టీ  (వైఎస్ఆర్‌టీపీ) విలీనంపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

గత ఏడాది చివర్లోనే  వైఎస్ఆర్‌టీపీ  కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో  వై.ఎస్. షర్మిల చర్చించారు. అయితే  తెలంగాణకు  చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు  వై.ఎస్. షర్మిల సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవడంపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో  వైఎస్ఆర్‌టీపీ  కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే మరోసారి వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ మరోసారి తెరమీదికి వచ్చింది.  ఇవాళ  హైద్రాబాద్ లోటస్ పాండ్ లో  వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయమై ఆ పార్టీ నేతలతో వై.ఎస్. షర్మిల చర్చించనున్నారు. 

గత ఏడాది చివర్లోనే  వైఎస్ఆర్‌టీపీ  కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో  వై.ఎస్. షర్మిల చర్చించారు. అయితే  తెలంగాణకు  చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు  వై.ఎస్. షర్మిల సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవడంపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో  వైఎస్ఆర్‌టీపీ  కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే మరోసారి వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ మరోసారి తెరమీదికి వచ్చింది.  ఇవాళ  హైద్రాబాద్ లోటస్ పాండ్ లో  వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయమై ఆ పార్టీ నేతలతో వై.ఎస్. షర్మిల చర్చించనున్నారు.  ఈ సమావేశం తర్వాత  కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి వై.ఎస్. షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉంది.

also read:ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఓటింగ్ శాతం తెచ్చుకోవాలని భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిలను చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.2023 డిసెంబర్ 27న న్యూఢిల్లీలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో  ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు భేటీ అయ్యారు.  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయాన్ని చర్చించారు.

also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం

ఈ విషయమై  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలతో చర్చించారు.  కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వై.ఎస్. షర్మిలను నియమించే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై  వై.ఎస్. షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ తరపున ప్రచారం చేయించాలని  ఆ పార్టీ యోచిస్తుంది. 

also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే   వైఎస్ఆర్‌టీపీలోని అసంతృప్తులు కూడ  ఆ పార్టీని వీడి వై.ఎస్. షర్మిలతో జత కట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  తాను వై.ఎస్. షర్మిల వెంట నడుస్తానని చేసిన ప్రకటన కూడ ఇందుకు బలం చేకూరుస్తుంది.

click me!