కేసీఆర్ కాస్త కమీషన్ల చంద్రశేఖర్ రావు అయ్యాడు..: షర్మిల సెటైర్లు

Published : May 22, 2023, 05:27 PM IST
కేసీఆర్ కాస్త కమీషన్ల చంద్రశేఖర్ రావు అయ్యాడు..: షర్మిల సెటైర్లు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రవ్యాఖ్యలు చేసారు. 

మహబూబ్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటోడు పందిరివేస్తే కుక్క తోక తగిలినా కూలిపోయేలా వుంటుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. ఇందుకు కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టిన మూడు నెలల్లోనే నీటమునగడమే ఉదాహరణ అని అన్నారు.  కేసీఅర్ ది ఒక దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ షర్మిల మండిపడ్డారు. 

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కోసం షాద్ నగర్ లో అఖిలపక్షం చేపట్టిన మహధర్నాలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడతూ... కేసీఅర్ ముఖ్యమంత్రి అయ్యాక పేరు మార్చుకున్నారని... కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాస్త కమీషన్ల చంద్ర శేకర్ రావు అయ్యాడంటూ ఎద్దేవా చేసారు. కేవలం తన కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నాడని అన్నారు. రీ డిజైన్ లు చేయడం... కమీషన్లు కాజేయడం మాత్రమే ఆయనకు తెలుసంటూ షర్మిల ఆరోపించారు. 

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.38 వేల కోట్లతో కట్టాలని అనుకున్నారని... దాన్ని కేసీఆర్ హయాంలో లక్ష కోట్లకు పెంచారని షర్మిల అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావే చెప్పారన్నారు. కేవలం 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి లక్ష కోట్లు ఖర్చు చేయాలా..? అని షర్మిల ప్రశ్నించారు. 

Read More  జీవో 111 ఎత్తివేత వెనుక పెద్ద భూ కుంభకోణం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణలో చేపట్టిన అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డి కంపనీకే ఇస్తున్నారని షర్మిల అన్నారు. స్కూల్ బెంచీల నుండి వేల కోట్ల ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఆయనకే ఇస్తున్నారని అన్నారు. మెగా కృష్ణారెడ్డి నుంచి కేసీఅర్ కమీషన్ లు తీసుకుంటున్నాడని ఆరోపించారు. ప్రజలకు అందించే ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బులు ఉండవు ... కానీ కమీషన్లు తీసుకోవడానికి మాత్రం డబ్బులు ఉంటాయన్నారు. 

గతంలో కేసీఅర్ డొక్కు స్కూటర్ పై తిరిగేవాడు... ఇప్పుడు లక్షల కోట్లు వెనకేసుకున్నాడని షర్మిల ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 12 వందల కోట్లు ఉన్నాయంటేనే కేసీఆర్ మరెంత పోగేసివుంటాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబం, బిఆర్ఎస్ పార్టీ నేతలు తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. 

కేసీఅర్ సీఎంగా ఉన్నంత కాలం రైతులు బాగుపడరు... పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి అవదన షర్మిల అన్నారు. అందుకే కేసీఅర్ ను సాగనంపి తగిన బుద్ది చెప్పాలని సూచించారు. వైఎస్సార్ టిపి అధికారంలోకి రాగానే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తుందని షర్మిల హామీ ఇచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే