తెలంగాణ అమరులకు ఎందుకు సహాయం చేయరు: కేసీఆర్ పై షర్మిల ఫైర్

Published : Mar 04, 2022, 04:42 PM IST
తెలంగాణ అమరులకు ఎందుకు సహాయం చేయరు: కేసీఆర్ పై షర్మిల ఫైర్

సారాంశం

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ఎందుకు సహాయం చేయరని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  కేసీఆర్ ను ప్రశ్నించారు.


హైదరాబాద్: తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు ఎందుకు సహాయం చేయరని YSRTP  అధ్యక్షురాలు YS Sharmila ప్రశ్నించారు. తెలంగాణ సీఎం KCR  జార్ఖండ్ టూర్ పై షర్మిల స్పందించారు.

గల్వాన్ లోయలో China తో జరిగిన ఘర్షణలో మరణించిన Army కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలను అందిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.ఈ హామీ మేరకు Jharkjhand రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆర్మీ జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు రూ. 10 లక్షల చెక్ ను అందించారు.

ఈ విషయమై షర్మిల మాట్లాడారు. అమర జవాన్ల కుటుంబాలకు  రూ. 10 లక్షలు ఇవ్వడం తప్పు కాదన్నారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడం తప్పు లేదన్నారు. కానీతెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు  ఎందకు సహాయం చేయరని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ కోసం 1200 మంది ప్రాణాలను అర్పించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  తెలంగాణ కోసం విద్యార్ధి, యువజనులు ప్రాణాలు అర్పించడం వల్లే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

గల్వాన్ లోయలో Chinaతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన కల్నల్ Santosh Babu కూడా ఉన్నారు. అయితే సంతోష్ బాబు కుటుంబంతో పాటు, మిగిలిన 19 మంది అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సంతోష్‌ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం..  మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున అందజేయనున్నట్టుగా చెప్పారు. గతంలో సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన కేసీఆర్ ప్రకటించిన సాయం అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి ఉద్యోగ నియమాక ప్రతాలు అందజేశారు.  

ఇప్పుడు మిగతా 19 మంది అమర జవాన్లను కుటుంబాలకు కూడా గతంలో ప్రకటించిన విధంగా రూ. 10 లక్షల చొప్పున సాయం అందజేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఇవాళ జార్ఖండ్ వెళ్లి  ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం అందించారు కేసీఆర్..ఎన్డీయేతర పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.ఈ క్రమంలోనే హేమంత్ సోరేన్ తో సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ చర్చించారు.

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదన్నారు. దేశానికి కొత్త అజెండా కావాలన్నారు. ఈ విషయమై అందరిని కలుస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు.ఇప్పుడే ఏ ఫ్రంట్ లేదని ఏదైనా వుంటే చెబుతామని ఆయన పేర్కొన్నారు. తాము ఎవరికి అనుకూలం, వ్యతిరేకం కాదన్న కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశం బాగు కోసమే తమ ప్రణాళిక అన్నారు

ఇవాళ ఢిల్లీ నుండి కేసీఆర్ రాంచీకి చేరుకున్నారు. రాంచీలో బిర్సా ముండా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం హేమంత్ సోరేన్ తో పాటు ఆయన తండ్రి శిబూ సోరేన్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?