ఇప్పుడు ఏ ఫ్రంట్ లేదు.. ఉంటే చెబుతాం, త్వరలోనే అందరినీ కలుస్తాం: జార్ఖండ్‌లో కేసీఆర్

Siva Kodati |  
Published : Mar 04, 2022, 04:12 PM IST
ఇప్పుడు ఏ ఫ్రంట్ లేదు.. ఉంటే చెబుతాం, త్వరలోనే అందరినీ కలుస్తాం: జార్ఖండ్‌లో కేసీఆర్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించామని ఆయన పేర్కొన్నారు. త్వరలో అందరినీ కలుస్తామని.. దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు  

తెలంగాణ ఉద్యమానికి (telangana movement) శిబుసోరెన్ (shibu soren) ఎంతగానో సహరించారని అన్నారు సీఎం కేసీఆర్ (kcr) . శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో (hemant soren) చంద్రశేఖర్ రావు (chandrasekhar rao) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. జార్ఖండ్ సీఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని పేర్కొన్నారు. త్వరలో అందరినీ కలుస్తామని.. దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇప్పుడే ఏ ఫ్రంట్ లేదని.. ఏదైనా వుంటే చెబుతామని ఆయన పేర్కొన్నారు. తాము ఎవరికి అనుకూలం, వ్యతిరేకం కాదన్న కేసీఆర్.. దేశం బాగు కోసమే తమ ప్రణాళిక అన్నారు. 

అంతకుముందు న్యూఢిల్లీ నుండి తెలంగాణ సీఎం KCR రాంచీకి చేరుకొన్నారు. రాంచీలో నేరుగా బిర్సా ముండా చౌక్ కు చేరుకున్నారు. గిరిజన ఉద్యమ నేత, ఝార్ఖండ్ ప్రజల ఆరాధ్య నాయకుడు భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడనుంచి నేరుగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి సీఎం కేసిఆర్ చేరుకున్నారు. సీఎం హేమంత్ సోరేన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు.

గల్వాన్ లోయలో Chinaతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన కల్నల్ Santosh Babu కూడా ఉన్నారు. అయితే సంతోష్ బాబు కుటుంబంతో పాటు, మిగిలిన 19 మంది అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సంతోష్‌ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం..  మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున అందజేయనున్నట్టుగా చెప్పారు. 

గతంలో సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన కేసీఆర్ ప్రకటించిన సాయం అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి ఉద్యోగ నియమాక ప్రతాలు అందజేశారు. ఇప్పుడు మిగతా 19 మంది అమర జవాన్లను కుటుంబాలకు కూడా గతంలో ప్రకటించిన విధంగా రూ. 10 లక్షల చొప్పున సాయం అందజేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఇవాళ జార్ఖండ్ వెళ్లి  ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నారు కేసీఆర్. 

కాగా.. ఎన్డీయేతర పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.ఈ క్రమంలోనే హేమంత్ సోరేన్ తో సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ చర్చించారు.బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్   ఇటీవల కాలంలో తన మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. అంతేకాదు ఆయా పార్టీలు, సీఎంలను కూడా కలుస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.  బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా కేసీఆర్ కు ఫోన్ చేశారు. హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు కేసీఆర్ తో భేటీ అయ్యారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu