ఖమ్మం జిల్లా నేతలతో భేటీ: ఈ నెల 20న షర్మిల సమావేశం

Published : Feb 10, 2021, 02:51 PM IST
ఖమ్మం జిల్లా నేతలతో భేటీ: ఈ నెల 20న షర్మిల సమావేశం

సారాంశం

ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశం కానున్నారు.

హైదరాబాద్:  ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశం కానున్నారు.ఈ నెల 9వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఖమ్మం జిల్లా నేతలతో రెండో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

also read:షర్మిలకు కుడి ఎడమల: ఎవరీ కొండా రాఘవరెడ్డి ?

కొత్త పార్టీ  నిర్మాణం, కార్యాచరణపై పార్టీ నేతలతో షర్మిల చర్చించనున్నారు. వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు.అవసరమైతే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడ  షర్మిల పర్యటించనున్నారు.తెలంగాణలో పార్టీ ఏర్పాటు గురించే ప్రధానంగా చర్చించనున్నారు. ఈ ఏడాది మార్చిలో చేవేళ్లలో  షర్మిల పార్టీని ప్రకటించే అవకాశశం ఉంది.

ఖమ్మం తర్వాత మరో జిల్లా నేతలతో కూడ షర్మిల సమావేశం కానున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల ధీమాగా చెబుతున్నారు. రాజన్న రాజ్యం తెచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?