కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే:షర్మిల పార్టీపై జగ్గారెడ్డి

Published : Feb 10, 2021, 02:40 PM IST
కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే:షర్మిల పార్టీపై  జగ్గారెడ్డి

సారాంశం

కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  చెప్పారు.  


హైదరాబాద్:  కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  చెప్పారు.బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కూతురిగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చుగా ఆయన కోరారు.కొత్త పార్టీ పెట్టి షర్మిల తప్పు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

బీజేపీ స్క్రిప్ట్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నారని ఆయన ఆరోపించారు. హైద్రాబాద్ ఏమైనా పొలిటికల్ టూరిస్ట్ స్పాటా అని ఆయన ప్రశ్నించారు. షర్మిల పార్టీ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.

ఈ నెల 15 నుండి సదాశివపేట నుండి పాదయాత్ర ప్రారంభిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. సదాశివపేట నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహిస్తానని ఆయన చెప్పారు.అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం వద్ద పాదయాత్ర ముగిస్తానని ఆయన చెప్పారు. ఆరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుండి పాదయాాత్ర చేస్తున్నారు. జగ్గారెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం