సీఎం కేసిఆర్‌కు అత్యంత విలువైన బహుమతి ఇచ్చిన షర్మిల.. ఇంతకీ ఆ బహుమతేంటో తెలుసా..?

Published : Apr 14, 2023, 03:28 PM IST
సీఎం కేసిఆర్‌కు అత్యంత విలువైన బహుమతి ఇచ్చిన షర్మిల.. ఇంతకీ ఆ బహుమతేంటో తెలుసా..?

సారాంశం

Ambedkar Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సీఎం అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 

Ambedkar Statue: భారత దేశానికి తలమానికంగా నిలిచే చారిత్రక ఘట్టం తెలంగాణలో ఆవిష్కరణ కానున్నది. దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యఅతిథిగా బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
 
ఈ తరుణంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించింది.  ఎన్నికలు దగ్గర వచ్చాక అంబేడ్కర్ విగ్రహం వచ్చిందని ఆరోపించింది. తెలంగాణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యంలో ప్రజలకు హక్కులు లేకుండా పోయాయని. కేసీఆర్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు కొట్లాడే హక్కు కూడా లేకుండా చేశారని ఆరోపించారు.
 
అంబేద్కర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పుస్తకాన్ని కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా కేసీఆర్‌కు రాజ్యాంగ పుస్తకాన్ని అందజేస్తానని షర్మిల తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగంపై కేసీఆర్ ఏమాత్రం గౌరవం చూపడం లేదని, ఎస్సీ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు విడుదల చేయకుండా దళితులను మోసం చేశారని ఆమె ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చమని చెప్పి అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారని షర్మిల ఆరోపించారు.

ఎన్నికలకు ముందు కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం కేసీఆర్ దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారనీ,  అటువంటి కేసీఆర్ తనని తాను అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలంటూ విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. దీనికంటే పెద్ద జోక్ లేదు అంటే ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఒక ఆఫ్గనిస్తాన్. కేసీఆర్ ఒక తాలిబాన్ నేత అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు తెలంగాణలో రాజ్యాంగం అమలు జరుగుతుందా? అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. .కానీ తెలంగాణ యువతకు మాత్రం ఉద్యోగాల్లేవని ఎద్దేవా చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల .

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం