Hyderabad: తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఎండలో బయటకు వెళ్లే వారు వడదెబ్బ బారినపడకుండా రక్షణకు చర్యలు తీసుకోవాలని వాతావరణ, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Four die of heat stroke in Telangana: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలుల సైతం క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బగు గురై రాష్ట్రంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఎండలో బయటకు వెళ్లే వారు వడడెబ్బ బారినపడకుండా రక్షణకు చర్యలు తీసుకోవాలని వాతావరణ, ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నిన్న 44 డిగ్రీలకు పైగా, 10 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, మంచిర్యాల, వరంగల్ లో ఒక్కొక్కరు మృతి చెందారు.
ఆదిలాబాద్ లో పొలంలో మండుతున్న ఎండలో పనిచేస్తూ ఎస్.లింగయ్య (70) అనే రైతు మృతి చెందగా, నిర్మల్లో ఉపాధిహామీ పథకం కింద చెరువు ఒడ్డున పనిచేస్తున్న పి.రాజేశ్వర్ (45) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. మంచార్ పాల్ లో పండ్ల వ్యాపారి శ్రీనివాస్ (55) వడదెబ్బతో మృతి చెందగా, వరంగల్ లో 67 ఏళ్ల వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. ఎండల తీవ్రత పెరగడంతో ఈ వారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ఎండ తీవ్రత, పొడి వాతావరణం కారణంగా రోడ్లపై వేడి పెరిగింది.
నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 17 తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని, వచ్చే వారం వడదెబ్బ నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. అకాల వర్షాలు కురిసి వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని, అయితే ఏప్రిల్ 17 నాటికి వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని, ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుందన్నారు.