కాళేశ్వరం వైఎస్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చింది: వైఎస్ విజయమ్మ

Published : Oct 20, 2021, 01:45 PM ISTUpdated : Oct 20, 2021, 03:21 PM IST
కాళేశ్వరం వైఎస్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చింది: వైఎస్ విజయమ్మ

సారాంశం

వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగం లాంటిదని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. పాదయాత్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు.

చేవేళ్ల:వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన స్వర్ణయుగం లాంటిందని Ycp గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ Ys Sharmila పాదయాత్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని చేవేళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి వద్ద నిర్వహించిన సభలో వైసీపీ గౌరవాధ్యక్షురాలు ys Vijayamma ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మదిలోంచి పుట్టుకొచ్చిన ఆలోచన అని వైఎస్ విజయమ్మ అన్నారు.

also read:బంగారు తెలంగాణగా కాదు.. బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా మార్చారు: కేసీఆర్‌పై ష‌ర్మిల‌ విమర్శలు

ప్రజా ప్రస్థానం పేరుతో ఆనాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర ప్రభంజనం సృష్టించిందని ఆమె గుర్తు చేసుకొన్నారు. జనంతో మమేకమై ప్రజల హృదయాలకుYsr మరింత చేరువయ్యారని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగం లాంటిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకొచ్చిన పథకాలు దానికదే సాటి అని ఆమె చెప్పారు.

వ్యవసాయం రైతులకు పండగ చేసిన ఘనత వైఎస్ఆర్‌దేనని ఆమె చెప్పారు. రైతులకు  పంట రుణాలను మాఫీ చేశారన్నారు.ఇవాళ షర్మిల 10 కి.మీ పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు. షర్మిలతో పాటు విజయమ్మ కూడ రెండున్నర కి.మీ పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం మొయినాబాద్ లో పాదయాత్రకు షర్మిల విరామం ఇవ్వనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో చేవేళ్ల నుండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.ఈ పాదయాత్ర తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికల్లో కూడ వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ రెండోసారి ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకొంది.

ఈ పాదయాత్ర ప్రారంభానికి ముందు రోజున ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ షర్మిల, విజయమ్మలు నివాళులర్పించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్