యాదాద్రి ఆల‌యానికి వైసీపీ జ‌డ్పీటీసీ కిలో బంగారం విరాళం.. కేసీఆర్‌కు థాంక్స్

By team telugu  |  First Published Oct 20, 2021, 11:58 AM IST

యాదాద్రి  ఆల‌య విమాన గోపురానికి స్వ‌ర్ణ తాప‌డం కోసం విరాళాలు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపున‌కు చాలా మంది  స్పందిస్తున్నారు. చిన్నజీయర్  స్వామి పీఠంతో సహా పలువురు  వ్యాపారవేత్తలు కూడా విరాళాలు  అందజేస్తున్నారు. అయితే  తెలంగాణ నుంచే  కాకుండా ఏపీ  నుంచి కూడా యాదాద్రి  ఆల‌య విమాన గోపురానికి స్వ‌ర్ణ తాప‌డం కోసం విరాళాలు ఇచ్చేందకు ముందుకు  వస్తున్నారు.


తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి ఆలయాన్ని (Yadadri temple)  పరిశీలించిన  సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పున:ప్రారంభ ముహూర్తం తేదీని ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేపడతామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి తొమ్మిది రోజుల ముందే అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ఆధ్యాత్మికంగానూ నిరాదరణరకు గురైందని అన్నారు. నలుదిక్కులా చాటేలా  యదాద్రి పునర్నిర్మాణం చేపట్టామని చెప్పారు. చిన్నజీయర్ స్వామి సూచనలతో ఆలయ పనులు  జరిగాయని తెలిపారు. 

ఇక, యదాద్రి ఆలయ  విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)చెప్పారు. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరం అని అన్నారు. తొలి విరాళంగా తమ  కుటుంబం  తరఫున ఒక కిలో 16 తులాల బంగారం ఇస్తామని ప్రకటించారు. చాలా మంది దాతలు  విరాళం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. బంగారు తాపడానికి అయ్యే ఖర్చు  ప్రభుత్వానికి భారం కాదని.. ఈ బ‌ృహత్ కార్యంలో ప్రతి గ్రామం భాగస్వామి  అయ్యేలా  చేయడమే  తమ ఉద్దేశమని చెప్పారు.

Latest Videos

undefined

ఇక, యాదాద్రి  ఆల‌య విమాన గోపురానికి స్వ‌ర్ణ తాప‌డం కోసం విరాళాలు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపున‌కు చాలా మంది  స్పందిస్తున్నారు. చిన్నజీయర్  స్వామి పీఠంతో సహా పలువురు  వ్యాపారవేత్తలు కూడా విరాళాలు  అందజేస్తున్నారు. అయితే  తెలంగాణ నుంచే  కాకుండా ఏపీ  నుంచి కూడా యాదాద్రి  ఆల‌య విమాన గోపురానికి స్వ‌ర్ణ తాప‌డం కోసం విరాళాలు ఇచ్చేందకు ముందుకు  వస్తున్నారు. కడప జిల్లాకు (Kadapa District) చెందిన వైసీపీ  నాయకురాలు, చిన్న మండెం  జడ్పీటీసీ (YSRCP ZPTC) మోడం జయమ్మ కిలో బంగారం విరాళంగా ప్రకటించారు. 

Also read: తెలంగాణలో కొండెక్కిన చికెన్ ధరలు.. మాంసం ప్రియులకు చుక్కలు..

కేసీఆర్ పిలుపు మేర‌కు తాను.. త‌న కుటుంబ స‌భ్యులంద‌రం క‌లిసి ఒక కిలో బంగారాన్ని దేవాల‌యానికి విరాళంగా ఇస్తున్న‌ట్లు జయమ్మ  చెప్పారు. దీనికి సంబంధించిన చెక్కును యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిదిలో అంద‌జేస్తాన‌ని తెలిపారు.  ఇంతటి గొప్ప కార్యంలో  చేసినందుకు కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

click me!