హుజూరాబాద్‌లో మూడోసారి ఉపఎన్నిక: రెండు ఎన్నికల్లో గులాబీ జయకేతనం, ఈ దఫా విజయం ఎవరిది?

Published : Oct 20, 2021, 12:51 PM IST
హుజూరాబాద్‌లో మూడోసారి ఉపఎన్నిక: రెండు ఎన్నికల్లో గులాబీ జయకేతనం, ఈ దఫా విజయం ఎవరిది?

సారాంశం

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి మూడో దఫా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.గతంలో రెండు దఫాలు టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ దఫా విజయం ఎవరిని వరిస్తోందోనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

హైదరాబాద్: Huzurabad అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు రెండు దఫాలు ఉప ఎన్నికలు జరిగాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో మూడో దఫా ఉప ఎన్నికలు జరగనున్నాయి.2008, 2010లలో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కేసీఆర్ మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేశాడు.దీంతో ఈ ఏడాది జూన్ 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు.దీంతో ఈ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

also read:దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో  ఉప ఎన్నికలు జరిగాయి. 2004లో ఈ స్థానం నుండి Trsఅభ్యర్ధిగా పోటీ చేసిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఆ ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కెప్టెన్ లక్ష్మీకాంతారావు విజయం సాధించారు. 2009  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఈటల రాజేందర్  2018 వరకుటీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ విజయం సాధించారు.

ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈటల రాజేందర్ ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.ఇప్పటివరకు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. మూడో దఫా ఈ స్థానం నుండి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెండు ఉప ఎన్నికలు కూడా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే జరిగాయి. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని విన్పించేందుకు రాజీనామాలను టీఆర్ఎస్ అస్త్రంగా ఉపయోగించుకొంది. Telangana రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక జరుగుతుంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికకు మధ్య తేడా ఉంది. 

ఈ స్థానాన్ని దక్కించుకొనేందుకు Bjp, టీఆర్ఎస్ లు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఈ స్థానంలో ప్రజలు ఎవరికీ పట్టం కడుతారనే విషయమై వచ్చే నెల 2న తేలనుంది.ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగాEtela Rajender టీఆర్ఎస్ అభ్యర్ధిగా Gellu Srinivas Yadav, కాంగ్రెస్ అభ్యర్ధిగా Balumuri Venkat బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్