కేసీఆర్ అవినీతిలో మీకూ వాటా... అందుకే ఊదు కాలదు ‌- పీరు లేవదు: అమిత్ షా పై షర్మిల సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : May 15, 2022, 01:34 PM ISTUpdated : May 15, 2022, 01:45 PM IST
కేసీఆర్ అవినీతిలో మీకూ వాటా... అందుకే ఊదు కాలదు ‌- పీరు లేవదు: అమిత్ షా పై షర్మిల సంచలనం

సారాంశం

తెలంగాణ బిజెపి నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల ఘాటుగా స్పందించారు. ఎఎప్పుడూలేనిది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో తెలంగాణ బిజెపి నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపుసభలో కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేసారు. అమిత్ షా మాటలు ఊదు కాలదు... పీరు లేవదు అన్నట్లుగా వున్నాయని అన్నాయన్నారు. అవినీతి చేస్తున్నారని తెలిసికూడా మీ పాతమిత్రుడు కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చెయ్యరు? అని షర్మిల ప్రశ్నించారు. 

''రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకంలో వాటా ఉందంటున్నారు... అలాంటి మీకు కేసీఆర్ అవినీతిలో వాటాలెదంటే నమ్మాలా? ఈ ఎనిమిదేండ్లపాటు దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలిచ్చారని ఇక తెలంగాణలో కూడా ఇస్తారా? కేంద్రంలో అధికారంలో ఉండికూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనని మీరు... తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా?'' అంటూ షర్మిల నిలదీసారు. 

''రైతులను కార్లతో గుద్దిచంపిన మీరు మా రైతాంగాన్ని ఆదుకుంటామని చెవిలో పూలు పెడుతున్నారా? చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదు... ఇక ఎం మొహం పెట్టుకొని ఒక్క చాన్స్ ఆడుగుతున్నారు? నిలబెట్ట చేతకాదుగాని కూలగొట్టడంలో దిట్టలు మీరు'' అని షర్మిల మండిపడ్డారు. 

''మైనార్టీలను బలిపశువులను చేసి అధికార పీఠాలను ఎక్కుతున్న మీరు... వాల్లకున్న 4% రిజర్వేషన్ తీసెయ్యడం కాకుండా ఇంకేం ఆలోచించగలరు? గతంలో వైఎస్సార్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కలిసొచ్చినా పీకెయ్యలేరు. మీ మతోన్మాదాన్ని ఎదిరించగలగేది వైఎస్సార్ స్పూర్తి మాత్రమే'' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. 

అమిత్ షా ప్రసంగం: 

తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట విడతల వారిగా పాదయాత్ర చేపడుతున్నారు. మొదటి విడత పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా ముగిసిన తర్వాత ఇటీవలే రెండోవిడత పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర శనివారం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభతో ముగిసింది. ఈ సభకు కేంద్ర హోమంత్రి అమిత్ షాను ఆహ్వానించిన తెలంగాణ బిజెపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిరు. 

ఈ బహిరంగ సభలో కేసీఆర్ అవినీతితో పాటు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అమిత్ షా వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోని నీళ్లు, నిధులు, నియామకాల హామీ ఏమైందని కేసీఆర్ ను  అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీకి అధికారం ఇస్తే నీళ్లు, నిధులు, నియామకాల హామీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రానికి నిధులు కూడా వస్తాయని.. నిరుద్యోగులకు ఉపాధి కూడా వస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు యువత సిద్ధంగా వుందని అమిత్ షా అన్నారు.  

కేంద్ర ప్రభుత్వాన్ని శత్రువుగా భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్రంపై వుంటుందని.. అధికారమిస్తే ప్రతీ ధాన్యం, గింజ కొంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చిత్రీకరించారని ఆయన దుయ్యబట్టారు. రూ.18 వేల కోట్లు ఇస్తే హరితహారాన్ని మీ పథకంగా చెప్పుకుంటున్నారని.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ చేశారా అని అమిత్ షా ప్రశ్నించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్