తెలంగాణలో అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు: కాంగ్రెస్ నేత పీజేఆర్‌పై బీజేపీ నేత బండి ప్రశంసలు

By narsimha lodeFirst Published May 15, 2022, 12:52 PM IST
Highlights

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే  పేదలకు ఇళ్లు, జాబ్ క్యాలెండర్ కచ్చితంగా అమలు చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకొని ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించుకున్నారు.
 

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ళు,  జాబ్ క్యాలెండర్‌ ఖచ్చితంగా అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ప్రకటించారు.ఆదివారం నాడు Hyderabad  జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయలంలో ప్రత్యక పూజలు  బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. Praja Sangrama Yatra రెండో విడత పాదయాత్ర పూర్తైన సందర్భంగా  Peddamma  దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  పేదలకు ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నామని  బండి సంజయ్ ప్రకటించారు. త్వరలో మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర మెదలు పెడతానని  ఆయన ప్రకటించారు.

తెలంగాణ సీఎం KCR ఆయన కొడుకు KTR  లు పగటి వేషగాళ్ళు అంటూ మండిపడ్డార. గంగిరెద్దుల వాళ్ళకున్న విశ్వాసం కూడా  కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. గంగిరెద్దుల వాళ్ళపై భవిష్యత్ లో కేసీఆర్  టాక్స్ విధించిన ఆశ్చర్యం లేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షల ఇళ్ళు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

BJP ప్రభుత్వం వస్తేనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన చెప్పారు. Petrol డీజిల్ వ్యాట్ పై కూడా సీఎం కేసీఆర్ కమిషన్ తీసుకుంటున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.పెట్రోల్, డీజీల్ ద్వారా కమిషన్ తీసుకొంటున్న కేసీఆర్ కోటీశ్వరుడయ్యాడని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో TRS ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని ఆయన తేల్చి చెప్పారు. పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆశీర్వాదంతోనే ప్రజా సంగ్రామయాత్ర విజయవంతమైందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.నిఖార్సైన తెలంగాణవాదులు Amit Shah సభను విజయవంతం చేశారన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసమే ప్రజా సంగ్రామయాత్ర నిర్వహిస్తున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 14న  జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.ఈ నెల 14వ తేదీతో బండి సంజయ్ పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్రను తుక్కుగూడలో ముగించారు బండి సంజయ్. ఈ సందర్భంగా  బహింరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.  

2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు.  తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు.   పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.  రెండో విడత పాదయాత్ర పూర్తైన తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మరో విడత యాత్రను  బండి సంజయ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు బండి సంజయ్.  

also read:కేసీఆర్ గద్దె దిగాల్సిందే.. లేకుంటే తెలంగాణకు శ్రీలంక గతే, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి : బండి సంజయ్

2023 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పాదయాత్ర పినికి వస్తుందని కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేలను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు కమలదళం నేతలు

 కాంగ్రెస్ నేత పీ.జానర్థనరెడ్డిపై బండి సంజయ్  ప్రశంసలు

జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ దర్శనం చేసుకున్నాక పీజేఆర్ గర్తొచ్చారన్నారు. పీజేఆర్  ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు. గొప్ప దేవాలయం నిర్మించి పీజేఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు.

click me!