వంటగ్యాస్ సిలిండర్ల ధర పెంపును నిరిసిస్తూ బాలాపూ్ర లో నిర్వహించిన సభలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపును నిరసిస్తూ హైద్రాబాద్ బాలాపూర్ లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం నాడు ధర్నా నిర్వహించారు.
కేంద్రంలో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత LPG ధరలను విపరీతంగా పెంచారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. BJP సర్కార్ తీరుతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిల కోసం వెతుక్కోవాల్సిన సరిస్థితి నెలకొందన్నారు. బీజేపీ పాలనలో అన్ని ధరలు పెరిగాయని ఆమె చెప్పారు. వంట నూనె కొనాలంటే కంట నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజీల్ ధరలు విపరీతంగా పెరిగాయని ఆమె గుర్తు చేశారు.
undefined
also read:తెలంగాణలో స్కూల్స్, కాలేజ్‌ల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ప్రకటన.. వివరాలు ఇవే..
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని సబితా ఇంద్రారెడ్డి విమర్శలు చేశారు. నిన్న Hyderabad కు వచ్చిన అమిత్ షా వీటిపై ఎందుకు మాట్లాడలేదన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా Amit Shah షా సొల్లు మాటలు మాట్లాడుతున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. వంట గ్యాస్ ధరలు తగ్గించే వరకు బీజేపీ నేతలను రానివ్వద్దని ఆమె ప్రజలను కోరారు. ధరలు తగ్గించకపోతే ప్రజలే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఒక్కసారి చాన్స్ ఇవ్వాలని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారని బీజేపీ నేతలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు.