ఏసుప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు..
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. క్రైస్తవ సోదర సోదరీమణులు అత్యంత సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. కేకులు, క్రిస్మస్ ట్రీలు, షాపింగ్, పిండి వంటకాలు, క్యారల్స్, చర్చిల్లో ప్రార్థనలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎనుముల రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏసుప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గ నిర్దేశం చేశారని.. దైవ కుమారుడైన జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ పర్వదినం నాడు నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం..లను ఆయననుండి నేర్చుకుందామన్నారు. ఈ మహోన్నత సందేశాలను తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించారన్నారు. ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
undefined
YS Sharmila: నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌లు.. ఏపీలో కలిసే ఫైట్?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.. యేసు ప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం, ఎప్పటికి అనుసరణీయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరిమనులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రములో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సాహాలతో క్రిస్మస్ ను జరుపుకోవాలని, క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరు పాటుపడాలని అన్నారు. క్రీస్తు బోధనలు ఆచరనీయమని క్రీస్తు మార్గం అనుసరణీయం అని సీఎం అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్టొన్న చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.