
ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలన చేసి పథకాలను సమీక్షించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాల కోసం ఈ ప్రజా పాలన కాలంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లకు, ఇతర అధికారులకూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ ఆరు పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్బంలో ఆధార్, రేషన్ కార్డులు, ఇతర పత్రాల వివరాలు నమోదు చేయాలి. ఒక వేళ రేషన్ కార్డు లేకుంటే.. రేషన్ కార్డు లేదని మెన్షన్ చేయాలి. అధికారులు పరిశీలన చేసి రేషన్ కార్డులను అర్హులకు పంపిణీ చేస్తారు.
ఈ ఐదు పథకాలకు ఉమ్మడిగా..
మహాలక్ష్మీ పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఆ డేటాను కంప్యూటరీకరణ చేసుకుంటారు. ఆ తర్వాత విధిగా దరఖాస్తుకు సంబంధించిన రశీదును సదరు దరఖాస్తుదారుకు అందిస్తారు. ఈ ఐదు పథకాలను ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే దరఖాస్తులో అవసరమున్న వాటిని పేర్కొనవచ్చు.
Also Read: YS Sharmila: నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌లు.. ఏపీలో కలిసే ఫైట్?
గ్రామాల్లో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే బందోబస్తుతోపాటు, మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.