లింగ మార్పిడి చేసుకున్న యువకుడి అనుమానాస్పద మృతి..!

Published : May 19, 2021, 07:33 AM IST
లింగ మార్పిడి చేసుకున్న యువకుడి అనుమానాస్పద మృతి..!

సారాంశం

అనుకోకుండా ఆ లింగ మార్పిడి చేసుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.


ఓ యువకుడు ఇటీవల లింగ మార్పిడి చేయించుకొని యువతి గా మారాడు. యువతిగా మారినప్పటి నుంచి మరో వ్యక్తితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. సహజీవనం కూడా చేస్తున్నాడు. కాగా.. అనుకోకుండా ఆ లింగ మార్పిడి చేసుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇన్ స్పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బుద్ద తండాకు చెందిన మహేష్(23) మూడు సంవత్సరాల క్రితం లింగ మార్పిడి చేయించుకున్నాడు. యువతిగా మారిన తర్వాత తన పేరు కూడా అమృతగా మార్చుకున్నాడు. కాగా.. గత ఏడాది ఎన్టీఆర్ నగర్ కు చెందిన షేక్ జావేద్ తో పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కాగా.. అనుకోకుండా మంగళవారం అమృత శవమై కనిపించింది. ఆమెకు తెలిసిన వ్యక్తి కిషన్.. మంగళవారం ఇంటికి వెళ్లి చూడగా.. చనిపోయి కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్