తెలంగాణలో విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్: ఆయుష్ వైద్యులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ

By Siva KodatiFirst Published May 18, 2021, 9:36 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య పద్ధతులలో లభించే చికిత్స విధానాలను గురించి ఆయుష్ వైద్యులు సీఎస్‌కి వివరించారు.

బ్లాక్ ఫంగస్‌కు ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతపూర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, చార్మినార్, ఎర్రగడ్డలోని యునాని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నట్లు సోమేశ్ కుమార్‌కి వెల్లడించారు. ఆయుష్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న చికిత్సపై ఎప్పటికప్పుడు కరపత్రాలు, ప్రెస్ బ్రీఫింగ్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎస్ .. ఆయుష్ వైద్యులకు సూచించారు.

అలాగే బ్లాక్ ఫంగస్ నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నట్లు సోమేశ్ కుమార్ వెల్లడించారు. గాంధీ ఆసుపత్రి, కోఠిలోని ప్రభుత్వ ఇ.ఎన్.టి. ఆసుపత్రిలలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

Also Read:తెలంగాణ: అదుపులోకి రాని కరోనా.. మే 30 వరకు లాక్‌డౌన్, కేసీఆర్ కీలక నిర్ణయం

కాగా, సోమవారం కోవిడ్ బాధితులకు చికిత్స, ఔషధాలు, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల లభ్యతపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

దీనితో పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

click me!