తెలంగాణ: అదుపులోకి రాని కరోనా.. మే 30 వరకు లాక్‌డౌన్, కేసీఆర్ కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : May 18, 2021, 08:50 PM ISTUpdated : May 18, 2021, 08:54 PM IST
తెలంగాణ: అదుపులోకి రాని కరోనా.. మే 30 వరకు లాక్‌డౌన్, కేసీఆర్ కీలక నిర్ణయం

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమల్లో వున్న లాక్‌డౌన్‌ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడిన ఆయన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సిఎం ఆదేశించారు.

కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న నిర్వహించాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు