హైదరాబాద్ : మక్కా మసీదు వద్ద బీజేపీకి వ్యతిరేకంగా యువకుల ఆందోళన, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jun 10, 2022, 02:14 PM IST
హైదరాబాద్ : మక్కా మసీదు వద్ద బీజేపీకి వ్యతిరేకంగా యువకుల ఆందోళన, ఉద్రిక్తత

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీద్ వద్ద శుక్రవారం బీజేపీకి వ్యతిరేకంగా కొందరు యువకులు నినాదాలు చేయడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు మక్కా మసీదు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు

హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీద్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కొందరు యువకులు నినాదాలు చేయడంతో కలకలం రేగింది. ప్రార్థనల తర్వాత బయటకు వచ్చిన యువకులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మక్కా మసీదు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana
Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి