చాక్లెట్ ఆశ చూపి.. 13యేళ్ల బాలుడిపై యువకుడి అత్యాచారం...

Published : Nov 26, 2021, 02:29 PM ISTUpdated : Nov 26, 2021, 02:30 PM IST
చాక్లెట్ ఆశ చూపి.. 13యేళ్ల బాలుడిపై యువకుడి అత్యాచారం...

సారాంశం

పార్శిగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ (23) సికింద్రాబాద్ లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని Chocolates ఇస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ బాలుడి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

చిలకలగూడ : హైదరాబాద్ లోని చిలకలగూడలో దారుణం జరిగింది. ఓ బాలుడిపై యువకుడు Sexual assaultకి పాల్పడ్డాడు. అత్యంత హేయమైన ఈ ఘటనతో చిన్నారుల రక్షణ మీద అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటన chilakalaguda పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెడితే...

పార్శిగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ (23) సికింద్రాబాద్ లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని Chocolates ఇస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ బాలుడి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

దీంతో బాలుడు షాక్ కు గురయ్యాడు. తీవ్ర భయాందోళనలతో ఏడుస్తూ ఇంటివి వచ్చాడు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, 2021 జులైలో ఏడేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కాగా.. ఆ బాలుడిని చంపిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్  పరిధిలోని జల్ పల్లి న్యూ హుడా కాలనీకి చెందిన ఒమర్ బిన్ వ్యసనాలకు అలవాటు పడి ఆకతాయిలా తిరిగేవాడు.

కిరాణా షాపుకు వెళ్తున్న బాలుడిని ఒమర్ బిన్ చాక్లెట్ ఆశ చూపించి ఎత్తుకెళ్లాడు. సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, బాలుడిపై లైంగిక దాడి చేశాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో... వెంటనే నేలకేసి కొట్టాడు. దీంతో... తలకు తీవ్రమైన గాయం కావడంతో.. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పాశవికం : బాలుడిపై అత్యాచారం, హత్య... మూడు మరణశిక్షలు విధించిన కోర్టు..

కాగా.. బాలుడి అరుపులు విన్న స్థానికులు అక్కడికి పరుగున వచ్చారు. అప్పటికే బాలుడు చనిపోయి కనిపించాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన 2019 మే 8న చోటుచేసుకుంది. కాగా.. బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడిని పట్టుకోగలిగారు. తాజాగా.. నిందితుడికి న్యాయస్థానం  జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

కాగా, ఇలాంటి ఘటన 2021, ఫిబ్రవరిలో తమిళనాడులో జరిగింది. అయితే ఈ కేసులో పదిమేఢేళ్ల బాలుడి మీద పాశవికంగా అత్యాచారం చేసి అతని మరణానికి కారణం అయిన మానవ మృగానికి తమిళనాడు కోర్టు మూడు మరణశిక్షలు విధించింది. 

ఈ ఘటన 2019లో పుదుక్కోటై జిల్లా, కీర్నూర్ లో జరిగింది. ఈ దాడిలో చనిపోయిన బాలుడు మానసిక బుద్దిమాంధ్యంతో బాధపడుతున్నాడు. నిందితుడు కూలీగా పనిచేస్తూ ఆ చిన్నారి మీద అసహజ పద్ధతిలో కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారికి ఎత్తుకెళ్లి.. పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి.. ప్రైవేట్ పార్ట్స్ లో చెట్టుకొమ్మలు దూర్చి అక్కడే వదిలేసి వెళ్లాడు. దీంతో బాలుడు చనిపోయాడు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu