‘వీరజవాన్లకే దిక్కు లేదు, రైతులకు ఎక్స్ గ్రేషియా?ఎన్ని యుగాలు పడుతుందో..’ కేసీఆర్ కి ప్రవీణ్ కుమార్ పంచ్ లు...

By AN TeluguFirst Published Nov 26, 2021, 12:28 PM IST
Highlights

ఈ ఘర్షణలో అమరులైనవారి కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలలువుతుందని, ఒక్క Colonel Santosh Kumar కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు 19మంది వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే... ఇటీవలే ప్రకటించిన 700మంది అమరులైన రైతు కుటుంబాలకు Ex Gracia అందడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో..అని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గత జూన్ లో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన అందరు వీరజవాన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయాన్ని Dr. RS Praveen Kumar గుర్తు చేశారు. 

ఈ ఘర్షణలో అమరులైనవారి కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలలువుతుందని, ఒక్క Colonel Santosh Kumar కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు 19మంది వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే... ఇటీవలే ప్రకటించిన 700మంది అమరులైన రైతు కుటుంబాలకు Ex Gracia అందడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో..అని ఎద్దేవా చేశారు. 

ఇదిలా ఉండగా, వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని నవంబర్ 20న కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నవంబర్ 20, శనివారం ఆయన telangana bhavanలో మీడియాతో మాట్లాడారు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సర టార్గెట్ ఇవ్వమని కోరినా స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. 

చివరి ప్రయత్నంగా ఆదివారం, నవంబర్ 21న ఢిల్లీకి వెళ్తున్నామని.. కేంద్రమంత్రులు, అధికారులను కలుస్తామని, అవకాశముంటే ప్రధాని మోడీని కూడా కలుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. యాసంగిలో  బాయిల్డ్ రైస్ కొనేదిలేదని వార్త వచ్చిందని.. అది గాలివార్తా లేక నిజమా అనేది తెలుసుకుంటామని కేసీఆర్ ఆ సమయంలో మాట్లాడుతూ అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ, ప్రధాని narendra modi సారీ చెబితే సరిపోదని.. రైతులపై దేశద్రోహం పెట్టారని సాగు చట్టాలపై కేసీఆర్ స్పందించారు. రైతులపై పెట్టిన  వేలాది కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎం డిమాండ్ చేశారు. farmer protestలో పాల్గొన్న వారిలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తాడట, మరి తెలంగాణలో సంగతేంటీ: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

రైతు ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. రైతులది స్ఫూర్తివంతమైన పోరాటమని ప్రశంసించారు. చనిపోయిన రైతు కుటుంబాలకు వెంటనే కేంద్రం రూ.25 లక్షలు ఇవ్వాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. కనీస మద్ధతు ధర చట్టాన్ని కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో  ప్రవేశపెట్టాని సీఎం కోరారు. 

విద్యుత్ చట్టాన్ని కూడా తీసుకొచ్చారని.. తాము తెలంగాణలో ఉచిత విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. నూతన చట్టంతో రైతులపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని సీఎం దుయ్యబట్టారు. ఉచితంగా ఇచ్చే రాష్ట్రాలను కేంద్రం మీటర్లు పెట్టాలని  ఒత్తిడి తెస్తోందని.. రాష్ట్రాలకు వచ్చే నిధులు నిలిపివేస్తామని ఒత్తిడి చేస్తున్నారని కేసీఆర్ ఆయన మండిపడ్డారు. నూతన విద్యుత్ చట్టాన్ని మాపై రుద్దవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బావులు, బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలనడం వ్యవసాయ వ్యతిరేక చర్య అని సీఎం ఎద్దేవా చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రావాల్సినవి ఇంకా రాలేదని.. నీటి వాటాలు ఇంకా తేల్చలేదని కేసీఆర్ మండిపడ్డారు. 

click me!