పట్టపగలే దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే గొంతు కోసేసి..

Published : Oct 01, 2018, 12:26 PM IST
పట్టపగలే దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే గొంతు కోసేసి..

సారాంశం

 కత్తితో వెనుక నుంచి పొడిచి కింద పడిపోగానే కత్తితో గొంతుకోసి కత్తిని అక్కడే పడవేసి పారిపోయాడు. గమనించిన పక్కనే ఉన్న కొందరు దగ్గరకు చేరుకునేలోపే దారుణం జరి గింది. తీవ్ర రక్తస్రావంతో వృద్ధుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు.

నల్గొండ జిల్లాలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే.. ఓ యువకుడు వృద్ధుడి గొంతు కోసేసి హత్య చేశాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మానికి చెందిన శివార్ల లింగయ్య(65) అనే వృ ద్ధుడు గ్రామ సెంటర్‌లో నడుచుకుంటూ వస్తున్నా డు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కొట్ర అనిల్‌ అనే యువకుడు కత్తితో వెనుక నుంచి పొడిచి కింద పడిపోగానే కత్తితో గొంతుకోసి కత్తిని అక్కడే పడవేసి పారిపోయాడు. గమనించిన పక్కనే ఉన్న కొందరు దగ్గరకు చేరుకునేలోపే దారుణం జరి గింది. తీవ్ర రక్తస్రావంతో వృద్ధుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు.

కోట్ర అనిల్‌ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లింగయ్య చేతబడి చేస్తున్నాడనే అనుమానం అనిల్‌ కుటుంబ సభ్యుల్లో నెలకొంది. గతంలో ఇదే విషయమై లింగయ్యపై దాడి చేయగా గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వివాదం అంతటిలో ముగిసింది. ఇటీవల అనిల్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఇంటర్‌ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. 

తన అనారోగ్యానికి లింగయ్య చేతబడే కారణమనే అనుమానంతో యువకుడు కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. హతుడు లింగయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని మల్లేపల్లి సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ క్రాంతికుమార్‌లు పరిశీలించారు. నింది తుడు పరారీలో ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu