అత్తాపూర్ మర్డర్: రమేష్ హత్యకు ముందు కిషన్‌ ఏం చేశాడంటే?

Published : Oct 01, 2018, 12:11 PM IST
అత్తాపూర్ మర్డర్: రమేష్ హత్యకు ముందు కిషన్‌ ఏం చేశాడంటే?

సారాంశం

అత్తాపూర్‌లో  రమేష్ గౌడ్‌ను హత్య చేసే కొద్దిసేపటి ముందు మహేష్‌గౌడ్ తండ్రి కిషన్‌గౌడ్ ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు

అత్తాపూర్: అత్తాపూర్‌లో  రమేష్ గౌడ్‌ను హత్య చేసే కొద్దిసేపటి ముందు మహేష్‌గౌడ్ తండ్రి కిషన్‌గౌడ్ ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అత్తాపూర్‌లోని పిల్లర్ నెంబర్ 143 వద్ద  2018 సెప్టెంబర్ 26వ తేదీన కిషన్‌గౌడ్ అనే వ్యక్తి  మరో ముగ్గురి సహాయంతో  రమేష్‌ను హత్య చేశాడు.  అయితే రమేష్‌ను కాపాడేందుకు  ట్రాఫిక్ కానిస్టేబుల్ సహ కొందరు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు.

అయితే  ఈ ఘటనకు కొద్ది గంటల ముందు మహేష్‌గౌడ్ తండ్రి  ఓ మద్యం దుకాణంలో  మద్యం కొనుగోలు చేశాడు.  మద్యం మత్తులోనే కిషన్‌గౌడ్  రమేష్‌ను హత్య చేశాడు.  ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. 2017 డిసెంబర్ 24వ తేదీన  తన కొడుకు మహేష్‌ గౌడ్‌ను  హత్య చేసినందుకు ప్రతీకారంగా ... మహేష్‌గౌడ్ తండ్రి కిషన్ గౌడ్  రమేష్‌ను హత్య చేశాడు. 

అయితే కిషన్ గౌడ్  ఓ మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేశాడు. మద్యం కొనుగోలు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెలరోజులుగా రమేష్ కోసం  కిషన్‌గౌడ్ వెతుకుతున్నాడు. చివరకు రమేష్ కోర్టు నుండి వస్తుండగా కిషన్‌గౌడ్‌ చేతికి చిక్కాడు.

సంబంధిత వార్తలు

అత్తాపూర్ మర్డర్‌లో ట్విస్ట్: సంచలన విషయాన్ని బయటపెట్టిన సోదరుడు

అత్తాపూర్ మర్డర్: రమేష్‌ను కాపాడేందుకు ముగ్గురి సాహసం

అత్తాపూర్ మర్డర్: 'కొడుకా.. నీ వద్దకే రమేష్‌ను పంపా'

10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే(వీడియో)

అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu