బోధన్ శివారులో కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం.. అదే కారణమా..?

By Sumanth Kanukula  |  First Published Dec 12, 2022, 12:45 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ శివారు పసుపువాగు వద్ద కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతుంది. 


నిజామాబాద్ జిల్లా బోధన్ శివారు పసుపువాగు వద్ద కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఆ మృతదేహం బోధన్ మండలం ఖండేగావ్ వాసి శ్రీకాంత్‌‌దిగా గుర్తించారు. అయితే మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన శ్రీకాంత్.. ఇలా అనుమానస్పద స్థితిలో మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే శ్రీకాంత్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్‌ను హత్య చేశారని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.  

ప్రేమ వ్యవహారంలోనే శ్రీకాంత్‌‌ను హత్య చేశారని.. చెట్టుకు ఉరివేసి చంపారని అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు బోధన్-రుద్రూర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. శ్రీకాంత్‌ది హత్యా?, ఆత్మహత్యా? అనేది తేల్చేందుకు  దర్యాప్తు జరుపుతున్నారు. 

Latest Videos

click me!