మాండౌస్ తుపాను కారణంగా హైదరాబాద్ వర్షాలతో ఇబ్బంది పడుతోంది. మరో రెండు రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
హైదరాబాద్ : మాండౌస్ తుపాను కారణంగా హైదరాబాద్ నగరం కూడా తడిసి ముద్దవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ చలితో వణికిపోతోంది. దానికి తోడు తుపాను కారణంగా వర్షాలు.. ఆదివారం ఉదయం నుంచి కురుస్తూనే ఉన్నాయి. మామూలుగా చలి తీవ్రత కారణంగా ఉదయం 9 గంటల వరకు.. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. తలుపులు కిటికీలు బిగించినా కూడా చలి వణికిస్తోంది. ఈ చలిలో పిల్లలు, ముసలివారు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం మాండౌస్ తుఫానుగా మారడంతో.. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా ముసురు కురుస్తోంది. తుఫాను వల్ల హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం అర్థరాత్రి మొదలైన వాన ఆదివారం కూడా కొనసాగింది. మధ్యలో కాస్త తెరిపి ఇచ్చి.. మళ్లీ ఆదివారం రాత్రి మొదలైన వాన సోమవారం కూడా కురుస్తూనే ఉంది.
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30మంది నర్సింగ్ విద్యార్థులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం...
దీంతో మెదీపట్నం, నారాయణగూడ, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, షేక్పేట, గోల్కొండ, బండ్లగూడ, హైదరాబాద్, హయత్ నగర్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, సరూర్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. కాగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మాండౌస్ తుఫాను తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో, కర్ణాటకలో కొంత మేరకు చురుగ్గా కొనసాగడంతో ఆదివారం హైదరాబాద్ సమీప జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డిలో వాతావరణం మేఘావృతమై జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ వివరాల మేరకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు.. అకాల తేలికపాటి నుండి మోస్తరు జల్లులు, మేఘావృతమై ఉండడం డిసెంబర్ 14 బుధవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుండి ప్రారంభమైన తేలికపాటి వర్షం.. తెల్లవారుజాము వరకు కొనసాగింది.
హైదరాబాద్, దాని పరిసరాలు పూర్తిగా మేఘావృతమై ఉండడంతో పాటు అప్పుడప్పుడు తేలికపాటి చినుకులు కురుస్తుండడంతో ఆ రోజంతా చల్లగా, తేమగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఎల్‌బి నగర్-హయత్‌నగర్ పరిసరాల్లో ప్రారంభమైన వాన ఆ తర్వాత, ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్ర రాజధానిలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి.
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధవంతమైన వర్షం కురిసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రోజువారీ వర్షపాతం గణాంకాల ప్రకారం, ఆదివారం రాత్రి వరకు శెరిలింగంపల్లిలో అత్యధికంగా 23.5 మిమీ వర్షం కురిసింది, బహదూర్‌పురలో 5.3 మిమీ, రాజేందర్‌నగర్‌లో 5 మిమీ వర్షపాతం నమోదైంది.
ఇక బెంగళూరు వాతావరణ తుఫాను మాండౌస్ వారాంతంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మాండౌస్ తుపాను బలహీనపడటంతో బెంగళూరులో చలి వణికించింది. ఐటీ సిటీలో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.