ఛీ..వీళ్లు.. మనుషులేనా? 16యేళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి.. వీడియో తీసి.. వైరల్ చేసి..

By SumaBala Bukka  |  First Published Nov 2, 2022, 12:56 PM IST

హైదరాబాద్ లో యువకులు దారుణానికి ఒడిగట్టారు. పదహారేళ్ల బాలుడు మర్మాంగాలపై టపాసులు పేల్చి, అదంతా వీడియో తీసి వైరల్ చేశారు. 


హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన 16యేళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి వీడియోను వైరల్ చేసి దారుణానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్ కు చెందిన 16యేళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. 

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్ డబ్ల్యూ రెడీమిక్స్ ప్లాంట్ లో పనిచేసేందుకు వచ్చాడు. కాగా కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురి చేస్తున్న తోటి యువకులు బాలుడి మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ ఆ తతంగాన్ని వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సదరు బాలుడి సెల్ ఫోన్ లాక్కుని బెదిరించారు. 

Latest Videos

ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద వంశీ అనే విద్యార్ధి ఆత్మహత్యాయత్నం:ఆసుపత్రిలో చికిత్స

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను బాధిత బాలుడి బంధువులు చూడడంతో విషయం కుటుంబీకులకు చేరింది. ఆ తర్వాత వారు బాలుడికి ఫోన్ చేసి సంఘటన గురించి ఆరా తీశారు. బాలుడు అది నిజం అని తెలపంతో బాధిుతుడి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆ కేసును మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈమేరకు మేడ్చల్ ఇన్ స్పెక్టర్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు అని ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 

click me!