
హైదరాబాద్‌లో సీసీఎస్‌లో బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై కేసు నమోదైంది. సరూర్ నగర్ కార్పొరేటర్‌గా ఉన్న ఆకుల శ్రీవాణి మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే టీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఆకుల శ్రీవాణికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన సీసీఎస్‌కు రావాలని పోలీసులు ఆదేశించారు. అయితే తనపై నమోదైన పోలీసు కేసుపై కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి స్పందించారు. కేటీఆర్ సోషల్ మీడియా 15 వేల జీతగాండ్లు నామీద తప్పుడు క్రిమినల్ కేస్ పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ చేస్తున్న తప్పులని ప్రశ్నిస్తున్నందుకు తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడేందుకు సిద్దంగా ఉన్నట్టుగా వెల్లడించారు.
‘‘కేశాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మంత్రి కేటీఆర్‌పై నేను విమర్శలు చేయలేదు. నేను పోస్టు చేసిన వీడియో ఇప్పటికీ నా సోషల్ మీడియా అకౌంట్లలో ఉంది. నేను అన్నదేదంటే.. కేటీఆర్ ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ వాళ్లతోని బాగా తిరుగుతున్నడు.. సినిమా తీసుకుద్దామని అనుకన్నడేమో.. వాళ్ల అయ్యతో మాట్లాడి ఫామ్ హౌస్‌లో సినిమా తీసిండు.. అది ఫ్లాప్ మూవీ అని కామెంట్ చేశారు. దీని వల్ల గొడవలు జరుగుతాయని, శాంతిభద్రతలు దెబ్బతింటాయని నా మీద కేసు పెట్టారు.
కేవలం టీఆర్ఎస్ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నామని చెప్పి.. బీజేపీ వాళ్లను భయభ్రాంతులను చేయాలని పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారు. ఇంతకు ముందు నా డివిజన్‌లో ప్రాబ్లమ్ అయిందని మాట్లాడినందుకు.. అప్పుడు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కేసు పెట్టించింది. ఇప్పుడు కేటీఆర్ కేసు పెట్టించిండు. మేము కేసులకు భయపడేటోళ్లం కాదు. లా అనేది మీ సొత్తు కాదు. మేము న్యాయపరంగా కేసును ఎదుర్కొంటాం’’ అని శ్రీవాణి చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.