తరలిస్తుండగానే యువకుడి మృతి: శవాన్ని నిరాకరించిన ఫ్యామిలీ

By narsimha lode  |  First Published Jul 9, 2020, 12:13 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా లక్షణాలతో గురువారం నాడు ఓ యువకుడు మరణించాడు. అతని మృతదేహాం తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు రాలేదు. దీంతో ఏరియా ఆసుపత్రికి డెడ్‌బాడీని తరలించారు.


మిర్యాలగూడ: ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా లక్షణాలతో గురువారం నాడు ఓ యువకుడు మరణించాడు. అతని మృతదేహాం తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు రాలేదు. దీంతో ఏరియా ఆసుపత్రికి డెడ్‌బాడీని తరలించారు.

మిర్యాలగూడలో ఓ యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చేరేందుకు 108 అంబులెన్స్ లో గురువారం నాడు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు. ఆ యువకుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టుగా చెబుతున్నారు.

Latest Videos

undefined

also read:కరోనాతో 21,129 మంది మృతి: ఇండియాలో 7,67,296కి చేరిన కరోనా కేసులు

అంబులెన్స్ లోనే యువకుడు మరణించిన విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు ఆరోగ్య సిబ్బంది. అయితే ఈ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ముందుకు రాలేదు. దీంతో  డెడ్‌బాడీని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు అంబులెన్స్  సిబ్బంది.

కరోనా వైరస్ భయంతో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా కూడ అతని వద్దకు వెళ్లేందుకు కూడ భయపడుతున్నారు. స్వంత కుటుంబసభ్యులు కూడ అనారోగ్యంగా ఉన్నవారిని పలకరించేందుకు వెళ్లడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు బుధవారం నాటికి 29,536కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే 1924 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి.
 

click me!