కరోనా మరణాల్లో రికార్డు... రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, జర్నలిస్ట్ మృతి

By Arun Kumar PFirst Published Jul 9, 2020, 12:08 PM IST
Highlights

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో తొలి కరోనా మృతి నమోదయ్యింది. అలాగే హైదరాబాద్ లో మరో జర్నలిస్ట్ కరోనాతో మృత్యువాతపడ్డారు. 

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో తొలి కరోనా మృతి నమోదయ్యింది. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న నర్సంపేటలోని స్నేహ నగర్ కు చెందిన రిటైర్డ్  ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు. దీంతో నర్సంపేట ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు రావడానికి రావడానికి  కూడా భయపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా ప్రభలకుండా జాగ్రత్తలు వహిస్తూ అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరోవైపు ఈ కరోనా బారినపడి సీనియర్ పాత్రికేయుడు ఒకరు మృతిచెందిన విషాదం హైదరబాద్ లో చోటుచేసుకుంది. తీవ్రమైన అనారోగ్యంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన పాత్రికేయుడ కొద్ది సేపటి క్రితమే మృతిచెందారు. గత 10 రోజులుగా ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి మృత్యువాతపడ్డాడు.   

read more   డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇలా తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. నిన్న(బుధవారం) ఒక్కరోజే కొత్తగా 1,924 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29,536కి చేరుకుంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 11 మంది మరణించడంతో వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 324కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 11,933 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 17,279 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్క హైదరాబాద్‌లోనే 1,590 మందికి పాజిటివ్‌గా తేలింది.

 ఆ తర్వాత రంగారెడ్డి 99, మేడ్చల్‌ 43, సంగారెడ్డి 20, వరంగల్ 26, నిజామాబాద్ 19, మహబూబ్‌నగర్ 15, కరీంనగర్ 14, వనపర్తి 9, సూర్యాపేట 7, మెదక్, పెద్దపల్లి, యాదాద్రి‌లలో ఐదేసి కేసులు, ఖమ్మం 4, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూలులో మూడేసి కేసులు, ఆసిఫాబాద్, నారాయణపేటలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

కాగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరి తీసుకోవడంలో నాగేందర్ ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమే ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ప్రభుత్వాసుపత్రి మీద నమ్మకం ఉండబట్టే ఆయన గాంధీకి చికిత్స కోసం వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. 

 

click me!