తల్లి కళ్ల ముందే కొడుకు మృతి: ఆక్సిజన్ అందక నల్గొండ ఆసుపత్రిలో యువకుడి కన్నుమూత

By narsimha lode  |  First Published Jul 19, 2020, 1:23 PM IST

కరోనా లక్షణాలు ఉన్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటన నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకొంది.


నల్గొండ: కరోనా లక్షణాలు ఉన్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటన నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకొంది.

మాడ్గులపల్లి మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు కరోనా లక్షణాలతో నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో శనివారం నాడు చేరాడు. అప్పటికే అతను పలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరేందుకు వెళ్లినా వైద్యులు నిరాకరించడంతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.

Latest Videos

also read:హైద్రాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం: కరోనా ఉన్నా డ్యూటీ చేయాలని నర్సుల నిర్భంధం

శ్వాస తీసుకోవడానికి ఆ యువకుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ విషయమై డాక్టర్లకు చెప్పినా కూడ పట్టించుకోలేదని ఆ యువకుడి తల్లి ఆరోపించింది. కనీసం ఆక్సిజన్  పెట్టాలని కోరినా కూడ డాక్టర్లు పట్టీపట్టనట్టుగా వ్యవహరించినట్టుగా ఆమె చెబుతోంది.

తన కొడుకును బతికించుకొనేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కొడుకుకు శ్వాస తీసుకొనేలా ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.తన కళ్ల ముందే కొడుకు కన్నుమూశాడు. దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆమె ఆరోపించింది. తన కొడుకు డాక్టర్లు చూడలేదని మృతుడి తల్లి విమర్శించారు.

click me!