అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం: ఇద్దరి ఆత్మహత్య

Published : Jul 19, 2020, 10:17 AM ISTUpdated : Jul 19, 2020, 12:11 PM IST
అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం: ఇద్దరి ఆత్మహత్య

సారాంశం

వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. వివాహత మరణంతో ముగ్గురు పిల్లలు తల్లి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకొంది.

మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. వివాహత మరణంతో ముగ్గురు పిల్లలు తల్లి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకొంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మదనాపురం మండలం భౌసింగ్ తండా పంచాయితీ పరిదిలోని స్కూల్‌గుట్ట తండాకు చెందిన వివాహితకు వరుసకు అల్లుడైన శివనాయక్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ నెల 17వ తేదీన వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మహిళ భర్త చూశాడు. దీంతో ఆమె ఆందోళన చెందింది. దీంతో వీరిద్దరూ కూడ మండలంలోని దుప్పల్లి గ్రామ శివారుకు వచ్చారు. తమ మధ్య వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలిసిందని.. ఇక గ్రామంలో ఉండలేమని భావించారు.

తండాలో ఉండే పరిస్థితులు ఉండవని భావించి ఇద్దరూ కూడ పురుగుల మందు తాగారు. పురుగుల మందు  తాగే ముందు శివనాయక్ తన తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఫోన్ చేసి చెప్పాడు. 

వెంటనే తండ్రి శివనాయక్ తో పాటు వివాహిత ఉన్న దుప్పల్లి వద్దకు చేరుకొన్నారు. అప్పటికే వీరిద్దరూ కూడ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గ్రామస్థుల సహాయంతో వీరిని 108 అంబులెన్స్ లో వనపర్తికి తరలించారు. 

వనపర్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి  చెందింది.  శివనాయక్ పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శివనాయక్ మరణించాడు.

రెండు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్ఐ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?